IPL 2026 GT VS RR ఫలితాల నవీకరణలు: గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ముల్లన్ పూర్లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్లతో ఘన విజయం ఉంది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. చిచ్చర పిడుగు, టీనేజ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్బ్ ఫిఫ్టీ (47 బంతుల్లో 96, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం చేజింగ్ ను గుజరాత్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 219 పరుగులు చేసింది. శుభామాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (53 బంతుల్లో 104, 15 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మకు తలో వికెట్ దక్కింది. ఈ ఫలితంతో గుజరాత్, ఫైనల్లో చోటు సంపాదించింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
మరియు ఇది చివరి రెండు స్టాండింగ్‌కి వస్తుంది! ❤️💙#TATAIPL | #ఫైనల్ | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/oINSqOjKhv
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 29, 2026
సూపర్ ఓపెనింగ్..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కు చక్కని శుభారంభం దక్కింది. నిజానికి 190 వరకు టార్గెట్ ఉంటే కంఫర్టబుల్ గా ఛేజ్ చేస్తే గుజరాత్ ఇంత పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తుందా..? అని అనిపించింది. అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ, గిల్, సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58, 8 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి మంచి స్టార్ట్‌ను అందించాడు. ముఖ్యంగా తొలి ఓవర్ వేసిన ఆర్చర్ ను టార్గెట్ చేసి ఫలితం సాధించారు. బిగ్ ఓవర్ సాధించాక, గుజరాత్ వెను తిరిగి చూడలేదు. బౌలర్లపై ప్రతాపం చూపిస్తూ, బౌండరీల వర్షం కురిపించారు గుజరాత్ బ్యాటర్లు. పవర్ ప్లేలో 69 పరుగులు ఉన్నాయి.
పార్క్ వెలుపల, బ్యాగ్‌లో విజయం 👊@గుజరాత్_టైటాన్స్ ఉత్కృష్టమైన పద్ధతిలో ఫైనల్‌కు చేరుకోండి 🤩💙
స్కోర్‌కార్డ్ ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #క్వాలిఫైయర్2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/zM5Zh9nUc7
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 29, 2026
రికార్డు స్థాయిలో 11వ సారి..
ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ జంట గిల్, సుదర్శన్ అద్బుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 11వ సారి శతక భాగస్వామ్యం నెలకొల్పి, సత్తా చాటారు. ఐపీఎల్లో ఇన్నిసార్లు భాగ స్వామ్యం నెలకొల్పడం ఇదే తొలిసారి. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత గుజరాత్ జోరు తగ్గలేదు. ఈక్రమంలో 30 బంతుల్లో గిల్, 26 బంతుల్లో సుదర్శన్ ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే గత మ్యాచ్ లోలాగానే హిట్ వికెట్ గా సుదర్శన్ ఔటయ్యాడు. దీనితో తొలి వికెట్ కు నమోదైన 167 పరుగుల భాగ స్వామ్యానికి తెర ప డింది. ఆ తర్వాత 47 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను ఔటైనా, జోస్ బట్లర్ (9 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. వాషింగ్టన్ సుందర్ (16), రాహుల్ తెవాటియా (17 నాటౌట్) లతో కలాసి లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఇది కూడా చదవండి: హార్దిక్ పాండ్య వార్తలు: హార్దిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
ఇంకా చదవండి

