డీ ఎం.హెచ్.ఓ శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ.డా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రపంచ పొగాకు ప్రత్యేక దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి ఎంహెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులయ్యారు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ఘనంగా జరుగుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించామని తెలిపారు న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సోమవారం జరుపుకుంటున్నాము అని, జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు మాట్లాడుతూ… పొగ తాగడం వలన భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయి, పొగాకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని, విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు నిలువెత్తు ఇన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
పొగ తాగే వారి కన్నా పీల్చే వారికే 60% క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని.. పొగాకు అలవాటు ఉన్నవారు ఈ వ్యసనాన్ని వెంటనే మానుకోవాలి.

