తెలంగాణ:తన రాజకీయ ప్రయాణం మొత్తం బీఆర్ఎస్ పార్టీకే అంకితమని మాజీ మంత్రి టి.హరీష్ రావు(మాజీ మంత్రి టి.
హరీష్ రావు) స్పష్టం చేశారు.బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.“నా పుట్టుక, నా చావు బీఆర్ఎస్లోనేనేను ఎక్కడికీ వెళ్లను.ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అలవాటు రేవంత్‌కు ఉంది.
ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన వ్యక్తి నా గురించి మాట్లాడతారా?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు.తాను జీవితాంతం బీఆర్ఎస్లోనే ఉంటానని, తన రాజకీయ జీవితం కె.చంద్రశేఖర్ రావుతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు.రేవంత్ కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ పాట పాడారని,రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం ఉందని పేర్కొన్నారు.
బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని,పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

