ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (సౌత్ కోస్ట్ రైల్వే జోన్) సోమవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన ఈ జోన్ దేశంలో 18వ రైల్వే జోన్‌గా గుర్తింపు పొందింది.
నుండి వీఎంఆర్డీఏ డెక్ భవనంలో( VMRDA డెక్ బిల్డింగ్ ) తాత్కాలిక జోన్ కార్యాలయాన్ని సిద్ధం చేసిన అధికారులు, మెకానికల్, సివిల్, టెలికమ్యూనికేషన్, పరిపాలనా విభాగాల కార్యకలాపాలను అక్కడి నుంచే నిర్వహిస్తారు.జోన్‌కు ఆర్వోను కూడా నియమించారు.
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు,గుంతకల్, విజయవాడ,విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయి.ఈ పునర్వ్యవస్థీకరణతో 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌కు ముగింపు పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు… రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో దక్షిణస్తా రైల్వే జోన్ కీలక పాత్ర పోషించారు.ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ),రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త జోన్ ఉత్తరాంధ్ర రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పారిశ్రామికాభివృద్ధి,ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందని చెప్పారు.మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం ఆంధ్రుల దశాబ్దాల ఆకాంక్షకు ప్రతి రూపం అన్నారు.రైల్వే మౌలిక వసతుల విస్తరణ,కొత్త రైళ్ల ప్రవేశం,ప్రాజెక్టుల వేగవంతానికి ఈ జోన్ దోహదపడుతుందని అన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ… దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు.జోన్ ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరగనుంది.జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సోమవారం,గుంతకల్,విజయవాడ, విశాఖ డివిజన్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.


