విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడంతోపాటు వారి సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు (సమ్మర్ క్యాంప్) శనివారం ఘనంగా ముగిశాయి. 28 ఏప్రిల్ నుంచి జూన్ 6 వరకు ఈ శిక్షణా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ విద్యా, సాంస్కృతిక, వికాస కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి వై. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో వక్తలు విద్యార్థులకు పుస్తకాల ప్రాముఖ్యత, పఠన సంస్కృతి ప్రాముఖ్యత గురించి వివరించారు. గ్రంథాలయాధికారి మాట్లాడుతూ డిజిటల్ యుగంలోనూ పుస్తకాలు ఏమాత్రం తగ్గలేదని, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించగలరని పేర్కొన్నారు. పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆలోచన శక్తిని, సృజనాత్మకతను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు పాలాక్షి మాట్లాడుతూ ప్రముఖులు చెప్పిన నిచినిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో” అనే సూక్తిని ప్రస్తావిస్తూ పుస్తకాలను గొప్పగా వివరించడం. మనిషికి నిజమైన మిత్రుడని, జీవితంలో సరైన మార్గాన్ని చూపే గురువని పేర్కొన్నారు. పుస్తకాలను కూడా చదివే అలవాటు చేయాలని సూచించారు.వేసవి శిక్షణ తరగతులు నిర్వహించిన వ్యాసరచన, పుస్తక పఠనం, యోగా తదితర పోటీల్లో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. గ్రంథాలయం ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

