బిఆర్ఎస్ నాయకులు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు
ఆర్ఆర్ఆర్, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు, పాలమూరు రంగారెడ్డి
ఎత్తిపోతల పథకం వద్దంటున్నారు
తుమ్మిడిహట్టిని నిర్మించకూడదని అంటున్నారు.. ఇలాగే వ్యవహారిస్తే రాబోయేది
రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
ఎవరెంత ఏడ్చినా అభివృద్ధి ఆగదు
కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా పట్టించుకోం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్
ఆఫీస్ కాంప్లెక్స్‌కు సిఎం శంకుస్థాపన
మనతెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడాలని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలపై సిఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అడ్డుపడినా అభివృద్ధి చేసుకుంటూ పోవాల్సిందేనని. కాలుష్యం వెదజల్లే ఫార్మాసిటీని వద్దని, ఫ్యూచర్‌సిటీని కట్టామని తెలిపారు. ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్యంతో స్థానికులకు నష్టం జరుగుతుందని అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని పెట్టామని తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన 500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తుంది. బిఆర్ఎస్ నాయకులు భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారని, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టిని నిర్మించకూడదని చెప్పారు.
ఇలాగే వ్యవహారిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కాదా అని, కారును తోయడానికి కూడా ఎవరూ దొరకరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అభివృద్ధి చేస్తుంటే, అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు అని బిఆర్ఎస్ చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పూర్తిగా చెడిపోయి కార్ఖానాలో ఉందని, ఎన్ని మరమ్మతులు చేసినా.. చెడిపోయిన ఆ కారు ఇక పనికిరాదని. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని. అసూయ పడేవాళ్లు, అజీర్ణం చేసుకునేవాళ్లు ఎప్పుడూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఎవరెంత ఏడ్చినా ఆర్ఆర్ఆర్, అభివృద్ధి ఆగదని తేల్చిచెప్పారు. రంగారెడ్డి కోహెడలో శనివారం సిఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శనివారం సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్, ఫ్యూచర్ సిటీ, పాలమూరు ప్రాజెక్టుల అభివృద్ధిని బిఆర్ఎస్ అడ్డుకుంటుందని, రోడ్డెక్కి ధర్నాలు జరిగాయి. ఈ పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించినప్పుడు తాత్కాలిక టెంట్లు వేశారని, గాలివాన వచ్చినప్పుడు రైతులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్ నిర్మిస్తామని నాడు ఎంపీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చాను అని, పండ్లు, కూరగాయలు అన్నీ లభించేలా ఈ మార్కెట్‌ను నిర్మించామని తెలిపారు.
మర్యాద తప్పితే.. పొలిమేరలు కూడా దాటనివ్వం..
కెసిఆర్ హయాంలో విధ్వంసం చేస్తే.. తాము వికాసం వైపు నడిపిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్,బిజెపి నేతలు అసూయ, పగ తమపై చూపారని.. కానీ ప్రజలపై కాదని చెప్పారు. సమస్యలు వస్తే పారిపోమని.. నిలబడి కొట్లాడి పరిష్కరించుకుంటామని అన్నారు. ఫామ్‌హౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధమని. చేతకాకపోతే దిగిపొమ్మంటున్నారని.. తాము అల్లాటప్పాగా రాలేదని చెప్పారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతామని చెప్పారు. మర్యాద తప్పితే.. పొలిమేరలు కూడా దాటనివ్వమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని చూపి భయపెట్టాలనుకుంటే.. ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరని చెప్పారు. ఈ 15వ తేదీ తర్వాత వడ్లు కొనకపోతే మోదీ సర్కార్ సంగతి చూస్తామని. మోదీని ముందు ప్రధాని గద్దె దిగితే రాహుల్ గాంధీని చేస్తే ప్రతి గింజ నేను కేంద్రంతో కొనిపిస్తామని అన్నారు. మెట్రో విస్తరణకు అనుమతులు తీసుకువస్తానని, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించి తీరుతామని చెప్పారు. మెట్రో విస్తరణకు అనుమతులు ఎలా ఇవ్వాలో, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్ పోర్టుకు ఎలా నిధులు ఇవ్వాలో చూస్తానంటూ. తమ మాటలే కాదని.. చేతలు కూడా తెలుసునని అన్నారు. కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో మీకు తెలుసునని. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుని రావాల్సిన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
రియల్ ఎస్టేట్ పెరిగి వ్యవసాయం కుంటుపడింది
రంగారెడ్డి జిల్లా రైతులు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు పండ్లు , కూరగాయలు, పాలు అందించేవారు అని, రియల్ ఎస్టేట్ పెరిగి ఇప్పుడు వ్యవసాయం కుంటుపడిందని అన్నారు. హైదరాబాద్ లోపల కోటి ముప్పై లక్షల జనాభా నివసిస్తోందని, అంతర్జాతీయ నగరంగా మారిందని తెలిపారు. ఇప్పుడు నగర ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నామని చెప్పారు. అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడంతో ఆ నాడే హామీ ఇచ్చానని చెప్పారు. పాలు, పండ్లు, కూరగాయలు ఏమైనా ఇక్కడికి వస్తే అందరికి అందుబాటులో ఉండేలా 240 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ ను నిర్మించుకుంటున్నాం. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ మనకు మరింత గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కొత్తిమీర లాంటివి కూడా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వరి, మొక్క జొన్న, పత్తి, మిర్చి లాంటి పంటలను మాత్రమే మన రైతులు పండిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అాయని అన్నారు.
మన ప్రాంతంలో ప్రతి పండును పండించాలని, కందుకూరు ప్రాంతంలో పండించే టమోటా కోసం సాస్ ఫ్యాక్టరీని తీసుకువస్తామని. ఫ్రూట్ మార్కెట్‌ను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారు. డిసెంబర్ నుంచే ఫ్రూట్ మార్కెట్ లో కార్యకలాపాలు ప్రారంభం కావాలని, రెండేళ్లలో ఫ్రూట్ మార్కెట్. నిర్మాణం పూర్తయింది ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం తుమ్మల, శ్రీధర్ బాబు ఇక్కడ కుర్చీ వేసుకుని పూర్తి చేశారు. గతంలో కెసిఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు రంగారెడ్డి కడతానని అన్నారు..కానీ, ఫామ్ హౌస్‌లో కూర్చున్నట్లు ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల జాబితాలు జరుగుతున్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. ప్రతి ఏడాది సంవత్సరానికి 15 వేల కోట్ల ఆదాయం వస్తోందని, ఇంత ఆదాయం ఇచ్చే వాళ్ల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 12 క్లాస్టర్లుగా విభజించి ఇంట్రిగ్రేట్ కాంప్లెక్స్‌లు నిర్మించామని తెలిపారు. 60 శాతం ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే వస్తోంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
వ్యవసాయాన్ని పండుగ చేశాం
వ్యవసాయాన్ని దండుగ అంటే పండుగ చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరి వేసుకుంటే ఊరే అని బిఆర్ఎస్ అంటే ఇప్పుడు వారికి మేము 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. లక్షా నలభై వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేశామని, ఏ ఊళ్లో వడ్లు పండినా కాళేశ్వరం నీళ్లు అని చెప్పుకుంటూ తిరిగేవారు అని, కానీ కాళేశ్వరం నుంచి ఇప్పుడు చుక్కు నీరు రాకుండానే రికార్డు స్థాయిలో వరి పండించామన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయి లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీగునీటి ప్రాజెక్టుల పైన హరీష్ రావు మీకు సలహాలు ఇస్తున్నారని, ఆయన సలహాలు తీసుకుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు మామకు సలహాలు ఇస్తే నడుం విరిగి ఫామ్ హౌజ్‌లో పడ్డారని. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్.. తమ నినాదమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చేయడమే కాదు సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పారు.
రైతులు ఉద్యాన పంటలు పండించి ఆదాయం పొందాలి: మంత్రి తుమ్మల
రైతులు ఉద్యాన పంటలు పండించి ఆదాయం పొందాలని మంత్రి తుమ్మల సూచించారు. రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చుపెట్టిన ఏకైక సిఎం రేవంత్‌రెడ్డి అని ప్రశంసించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నామని, ప్రపంచంలో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలని. సాంప్రదాయ పంటల సాగు చేస్తే నష్టం తప్పదని తెలుస్తుంది.
అధునాతన హంగులతో సమీకృత మార్కెట్ నిర్మాణం: మంత్రి శ్రీధర్‌బాబు
అధునాతన హంగులతో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని చూసి ప్రతిపక్షాలు ఓట్లు శ్రీధర్‌బాబు చూపించలేకపోతున్నారు. రైతులకు జరగకుండా గ్రీన్ఫార్మా ఫ్యూచర్‌సిటీ నష్టాన్ని, వాణిజ్యపంటల సాగుకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని తెలిపారు. రైతులు ఆదాయం పెంచేందుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు,శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహరెడ్డి,ఎంపీలు, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎంఎల్ఎలు మల్ రెడ్డి రంగారెడ్డి,నవీన్ యాదవ్,కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు.

