వరంగల్: ప్రేమజంటపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన వరంగల్ జిల్లా రంగశాయి పేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మిల్స్కాలనీలోని ఉర్సుగుట్ట ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ జంట ఏకాంతంగా గడుపుతోంది. పవన్ సింగ్, రవీందర్ సింగ్, సికందర్ సింగ్ అనే ముగ్గురు ప్రేమ జంటను చుట్టముట్టడంతో ఫొటోలు, వీడియోలు తీశరావు. అనంతరం వీడియోలను యువతి తల్లిదండ్రులకు పంపుతామని బెదిరించడంతో బంగారం, వెండి బరణాలు లాక్కున్నారు. అనంతరం లవర్ ముందే యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. వరంగల్లో యువకులు అమ్ముతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, మూడు ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసి రిమాండ్కు చేరుకున్నారు. నిందితులు కాజీపేటకు చెందిన వారని పోలీసులు గుర్తించారు.

