బాహుబలిని మిస్ చేసుకున్న మోహన్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ఎన్ని రికార్డులను సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించిన మొదటి సినిమాగా చరిత్రలో నిలిచింది. అలాగే అప్పటివరకు ఎవరు కూడా తెలుగు సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ చేయలేదు. మొదటిసారి ఈ సినిమా చేసి ఆ సాహసం చేసిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…అయితే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను మొదట వేరే వాళ్ళతో చేయాలని అనుకున్నారు. కానీ ఎవరికి వాళ్లు ఈ సినిమాని చూసి భయపడి మేము చేయలేము అని తప్పుకోవడంతో మరి కొంతమంది ఆర్టిస్టులు ఈ సినిమాకి ఆడ్ అయ్యారు.
దాంతో వాళ్ళకి ఎక్కడ లేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా ప్రభాస్ రానాలతో పాటు సరిసమానమైన గుర్తింపును సంపాదించుకున్న క్యారెక్టర్ కట్టప్ప… సత్యరాజ్ చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇలాంటిదే ఈ క్యారెక్టర్ ను మొదట మోహన్ బాబు తో చేయించాలనుకున్నారట.
కానీ మోహన్ బాబు ఆ క్యారెక్టర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు అతను కాద సత్య రాజ్ కి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ వల్లే సినిమా చాలావరకు హై ఎలివేషన్స్ ని మూటగట్టుకుంది. ఆయన బాహుబలి గురించి ఇచ్చే ఎలివేషన్స్ కావచ్చు. యుద్ధ సమయంలో ఆయన పోరాడిన విధానం అన్నీ కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సత్యరాజ్ కి ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.
మొత్తానికైతే మోహన్ బాబు ఈ సినిమాలో ఒక మంచి రోల్ ను మిస్ చేసుకున్నాడు అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్యారడైజ్, శ్రీనివాస మంగాపురం సినిమాల్లో వైవిధ్యమైన నటనను చూపించానని గతంలో మోహన్ బాబు చెప్పాడు. తన నటనతో ఏ రేంజ్ గుర్తింపును సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

