హైదరాబాద్: బిజెపి తన సీట్ చోరీకి హాజరైందని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ కాంప్రమైజ్ అయిందని, ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు అవకాశం లేదని అర్థమైందని, అందుకే ఎన్నికల అధికారులతో కుమ్మక్కు అయ్యారని తెలిపారు. నామినేషన్ తిరస్కరణకు గురైనందుకు తనకు నిరాశ లేదని, కనీసం వివరణ ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి అవకాశం ఇచ్చిన తనకెందుకు ఇవ్వలేదు? అని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. సంబంధం లేని కేసుతో తన నామినేషన్ తిరస్కరించారని, లీగల్ నోటీస్ క్రిమినల్ కేసు ఎలా అవుతుంది? అని నిలదీశారు. ఏదైనా ఫిర్యాదు వస్తే తన వివరణ, పరిమళ్ నత్వానీకి ఒక రూల్.. తనకు ఒక రూలా? అని ప్రశ్నించారు. సిల్లీ రీజన్ చూపి తనకు రాజ్యసభ ఎంపీ రాకుండా కనిపించింది. తెలంగాణలోని రాజ్యసభ సీటు తాను తీసుకోలేనని, తన కోసం మరొకరితో రాజీనామా చేయించి ఆ సీటు తాను తీసుకోలేనని అన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటానని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.

