Published on: 8:19 am, 24 జూన్ 2026
ప్రభుత్వాలు చేప’ట్టే కీలక కార్య క్రమాల’కు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ భారత్ లోగో(గాంధీ కళ్లజోడు, చేతి కర్రతో ఉన్నది) సూచించిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇచ్చారు. ఆ తర్వాత అప్పట్లో దీనిని మహారాష్ట్రకు చెందిన టెకీ ఒకరు సొంతం చేసుకున్నారు.
ఇలా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాము చేప’ట్టిన కార్యక్రమాల పేర్లను చెబితే.. అవి నచ్చి.. ఎంపికైతే కానుకలు, బహుమానాలు ఇస్తున్నాయి. గతంలో ఏపీ రాజధానికి పేరును సూచించే 50 వేల కానుక ప్రకటించారు. కానీ.. అమరావతి అధినేత పేరును ఓ ప్రముఖ పత్రిక సూచించడంతో ఆ పేరును ఖరారు చేశారు. ఆ తర్వాత.. యోగాంధ్ర సింబల్ సహా విశాఖ-గూగుల్ డేటా కేంద్రాల పేర్లతో ఒక చక్కని పేరును సూచించాలని కూడా ప్రభుత్వం కోరింది. దీనికి కూడా లక్ష రూపాయల కానుకను ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు vizaG- అనే పేరును సూచించి.. దానినే ఖరారు చేశారు. ఇలా.. కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించడం అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఇక, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్తగా వినూత్న పేరును సూచించిన వారికి లక్ష రూపాయల బహుమానం అందించింది. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని క్యూర్ జోన్‌గా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అభివృద్ది చేస్తోంది. దీనిని రాష్ట్రంలోని ప్రఖ్యాత నగరాలకు దీటుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారికీ భాగ స్వామ్యం కల్పించేందుకు పేదలకు కూడా ఇళ్లు కలిగించారు. దాదాపు లక్ష ఇళ్లను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి వినూత్న పేరును సూచించాలని ప్రభుత్వం కోరింది. ఈ నెల 28లోగా పేరును సూచించిన వారికి లక్ష రూపాయల బహుమ’తి ఇవ్వడముతోపాటు.. సూచించిన వారి పేరుతో ప్రకటన కూడా జారీ చేస్తామని ప్రకటించారు.
నిబంధనలు ఇవి..
- ఒక్కరు ఎన్ని పేర్లయినా సూచించవచ్చు.
- పేరులో క్యూర్ జోన్ ప్రతిబింబించాలి.
- తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటే మంచిది.
- లక్ష ఇళ్ల నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చాటేలా కూడా పేరు ఉండాలి.
- ప్రక్రియ మొత్తం tghd insta లో మాత్రమే సాగుతుంది.

