హైదరాబాద్: టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబలి’ ఒకటి. అయితే విజయ్‌కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘రణబలి’ సెట్స్‌లో 5 కారవాన్లు కావాలని కోరాడని, అసిస్టెంట్లు కూడా ఎక్కువ మంది కావాలని విజయ్ డిమాండ్ చేయాలని పుకార్లు పుట్టించారు. దీన్ని విజయ్ టీం ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేయగా.. ఆ ప్రకటనపై నిర్మాత రవి స్పందించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు. షూటింగ్ సమయంలో అలాంటి సమస్యలేవీ రాలేదని స్పష్టం చేశారు. విజయ్ ఎప్పుడు అంకితభావంతో పని చేస్తాడని తెలియజేసారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ టీం హెచ్చరించింది.

