వెనిజులా భూకంపం: వెనుజువెలా దేశంలో తీవ్రమైన భూకంపం సంభవించింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణనష్టం కూడా జరిగింది. దీనిని మర్చిపోకముందే జపాన్.. ఫిలిప్పీన్స్.. పాకిస్థాన్ దేశంలో వరుసగా భూకంపాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు వెనుజువెలా ఇక్కడ ఆస్తి నష్టం.. ప్రాణం నష్టం జరగలేదు.
వరుసగా భూకంపాలు రోజుల వ్యవధిలో చోటు చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి అకస్మాత్తుగా ప్రకంపనలకు గురికావడం.. భవనాలు నేలకూలిపోవడం జరుగుతున్నాయి. దీనివల్ల ప్రాణనష్టం.. ఆస్తి నష్టం జరుగుతోంది.. క్షణాల్లోనే ఈ ప్రమాదం జరగడంతో నష్ట నివారణ చర్యలకు ఆస్కారం ఏర్పడటం లేదు. భూమి లోపల టెక్టోనియస్ ప్లేట్లల్లో ఆకస్మికంగా కదలికలు.. ప్రకంపనలు ఏర్పడటం వల్ల భూకంపాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వెనుజువెల ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం భూమికి 27 లోతులోనే సంభవించడంతో నష్టం అధికంగా ఉంది. అయితే పాకిస్థాన్, జపాన్, ఫిలిప్పీన్స్ ప్రాంతంలో వరుసగా ప్రకంపనలు ఏర్పడటం.. ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 29 లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. సరిగ్గా కొన్ని వారాల క్రితం ఇక్కడ భూకంపం సంభవించింది. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
జపాన్ దేశంలో భూకంపాలు సహజం. పాకిస్థాన్లో కూడా భూకంపాలు గతంలో చోటుచేసుకున్నాయి. జపాన్ దేశంలో ఇవాటే ప్రీఫక్చర్ తీరంలో 6.9 నుంచి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది సముద్రమట్టానికి 50 లోతులో ఉంది. టోక్యో నుంచి మొదలు పెడితే హోమ్షూ ద్వీపం వరకు ప్రకంపనలు ఏర్పడ్డాయి. అయితే ఈ స్థాయిలో భూకంపం ఏర్పడేలా సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదు.
పాకిస్తాన్ దేశంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ కూడా ఇటువంటి నష్టాలకు సంబంధించిన వార్తలు రాలేదు. బలుచిస్తాన్ నుంచి మొదలుపెడితే గిల్గిత్ బాల్టిస్తాన్ వరకు భూకంపం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

