తెలంగాణ:నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధిహామీ కూలీలు (ఉపాధి హామీ పథకం కార్మికులు)నుంచి వారానికోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మొత్తం చెల్లిస్తేనే పూర్తి కూలీ ఖాతాలో జమ అవుతుందని కొందరు కూలీలు చెబుతున్నారు.
అభ్యర్ధన తరం వ్యక్తంచేసిన వారి హాజరును తగ్గిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.మేట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడితెచ్చి ఈవసూళ్లు జరుగుతున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది.ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశమైంది.పని కంటే ఫొటోలకే ప్రాధాన్యమా? కొన్నిచోట్ల పని చేయకపోయినా ఉదయం, సాయంత్రం ఫొటోలు దిగితే సరిపోతుందని కూలీలు చెబుతున్నారు.ప్రతిగా వారానికి కొంత మొత్తం షరతు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి..చెరువులు, కాలువలు,అటవీ ప్రాంతాలు జరిగే పనులను నిర్వహించడం కష్టమవడం ఈ పరిస్థితికి కారణమవుతోందని అంటున్నారు.దీంతో పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించాం.-ప్రమీల, ఏపీవోకిందిస్థాయి సిబ్బంది కొందరు అక్రమాలకు పాల్పడ్డారు.
వారు ఇప్పటికే తొలగించాం.హాజరు తప్పుగా నమోదు చేసినా,కూలి అకౌంట్లో పడకున్నా నా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తాను.
అలాగే అక్రమాలకు పాల్పడిన వారి గురించి తగిన ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.

