తిరుపతి జిల్లా వరదయ్య పాలెంలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. బుధవారం ( జులై 1 ) జరిగిన ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. హీరో మోటోకార్ప్ సంస్థ చేపట్టనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
హీరో మోటోకార్ప్ గ్లోబల్ భాగాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు వేగవంతమైన సేవలను అందించడం లక్ష్యంగా ఈ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హీరో విడి సంస్థ.
►ఇంకా చదవండి | అమరావతిపై వైసీపీ విషం కక్కుతోంది: సీఎం చంద్రబాబు
అనంతరం హీరో మోటోకార్ప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పవన్ ముంజాల్, అనీషా ముంజాల్, సీఈవో హర్షవర్ధన్ చిట్లే, సంస్థప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, అధికారులతో కలిసి హీరో మోటోకార్ప్ ప్లాంట్లో ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని సీఎం పరిశీలించారు. భవిష్యత్తులో ప్లాంట్ ద్వారా చేయనున్న ఉత్పత్తి, నిల్వ, పంపిణీ విధానాలపై వివరాలను తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.

