విశాలాంధ్ర – నార్పల:- మండల కేంద్రాన్ని క్రీడా మైదానంలో ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతున్న క్రీడాకారులు, యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నారు. దశాబ్దాలుగా నార్పల క్రీడా సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ మైదానం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులు ఎదిగారు. అలాంటి మైదానాన్ని క్రమంగా కుదిస్తూ యువత భవిష్యత్తును దెబ్బతీయడం సరైన నిర్ణయం కాదని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రహరీ గోడ నిర్మిస్తే క్రికెట్‌తో పాటు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు టోర్నమెంట్లకు ఇతర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జట్లు, ప్రస్తుత మైదానం కారణంగా ఆసక్తి చూపడం లేదు. క్రీడలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని తగ్గించి ప్రహరీ గోడ నిర్మించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, కానీ యువతకు మాత్రం శాశ్వత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతను చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి దూరంగా ఉంచే శక్తి క్రీడలకే ఉందని, అలాంటి క్రీడా వేదికలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉందని చూస్తున్నారు. తరాలకు ఉపయోగపడే క్రీడా మైదానాన్ని కాపాడకుండా దాని విస్తీర్ణాన్ని కుదించడం అభివృద్ధి కాదని, యువత అవకాశాలను హరించడమేనని విమర్శించారు.

