దత్తారేయ హోసబలే: అయోధ్యలోని రామాలయంలో విరాళాలను చోరీ చేసిన ఘటన దురదృష్టకరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే అన్నారు. హిందూ వర్గ ప్రజలు సంయనంతో ఉండాలని, క్లిష్ట పరిస్థితులలో ఓపికతో ఉండాలన్నారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాల ని హోస్బలే వివరించారు.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయంలోని విరాళాలను చోరీ చేసిన ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే(దత్తారేయ హోసబలే) స్పందించారు. ఆ ఘటన దురదృష్టకరమైందన్నారు. హిందూ వర్గ ప్రజలు సంయనంతో ఉండాలని, క్లిష్ట పరిస్థితులలో ఓపికతో ఉండాలని. రామ్‌లల్లా గుడిలోని హుండీ బాక్సుల నుంచి చోరీ జరగడం దురదృష్టకరమని, ఆ ఘటన రాముడి భక్తలను, యావత్ సమాజ మనోభావాలను, భక్తిని గాయపరిచాయన్నారు. ఆ ఘటన తీవ్రంగా బాధపెట్టినట్లు ఆయన చెప్పారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాల ని హోస్బలే వివరించారు. ఈ ఘటన ఆధారంగా హిందూ వ్యతిరేక శక్తులు.. హిందూ ధర్మాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ కుట్ర’ల’ను చేధించడానికి హిందూ స’మాజం ఓపికతో ఉండాల’ని అన్నారు.
#చూడండి | ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. అయోధ్యలోని శ్రీ రామ్‌లల్లా ఆలయంలో ఉంచిన విరాళాల పెట్టెలు చోరీకి గురికావడం వల్ల మొత్తం సమాజం, రామభక్తుల మనోభావాలు, భక్తిభావనలు దెబ్బతిన్నాయని, దీంతో మేమంతా బాధపడ్డామని చెప్పారు. pic.twitter.com/hEOk3J2w4g
– ANI (@ANI) జూలై 3, 2026

