హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులోని హాకర్ 800A విమానాన్ని ఆన్ లైన్ విధానంలో వేలం వేసింది ఎన్ ఫోర్స్ మెంట్ (ED) వేలం వేసింది. 2026, జూలై ఒకటో తేదీన వేలం వేయగా.. 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సందర్భంగా ఈడీ ప్రకటించింది. ఇంతకీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం వేలం వేయటం ఏంటి.. ఎవరిది ఈ విమానం అనే విషయాలు తెలుసుకుందాం..
ఫాల్కన్ పోంజీ కేసులోకి వెళితే.. నకిలీ ఇన్వాయిస్, డిస్కంట్స్ పేరుతో 792 కోట్ల రూపాయల పెట్టుబడిదారులను మోసం చేశాడు అమర్ దీప్ కుమార్. జనం నుంచి డబ్బు కొట్టేసిన విమానం కొన్నాడు.. విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా పెట్టుబడిదారులు అయిన జనాన్ని మోసం చేస్తున్నాడు. ఈడీ విచారణ చేపట్టింది. 2025, మార్చి 7వ తేదీన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమర్ దీప్ కుమార్ కు చెందిన హాకర్ 800A విమానాన్ని సీజ్ చేసింది ఈడీ. అప్పటి నుంచి అది అక్కడే ఉన్నది.
►ఇంకా చదవండి | స్కూళ్లకు సమీపంలో.. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాల నిషేధం!
ఫాల్కన్ పోంజీ కేసులో ఆస్తుల జప్తుపై.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న ఈ విమానాన్ని.. ఆన్ లైన్ వేలం ద్వారా అమ్మింది ఈడీ. 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ప్రకటించారు ఈడీ. పీఎంఎల్ఏ ఆడిటింగ్ అథారిటీ అనుమతితో విమానాన్ని ఈ-వేలంలో విక్రయించారు అధికారులు. విమానం అమ్మకంతో వచ్చిన 3 కోట్ల రూపాయలను బాధిత పెట్టుబడిదారులకు చెల్లించనుంది ఈడీ. కేసు విచారణ కొనసాగుతుందని.. మరిన్ని ఆస్తుల అమ్మకం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేసింది ఈడీ.

