టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ దర్శకులను కలిసి ప్రసన్నం చేసుకోవాలి. ముఖ్యంగా రచయితలకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. కొత్త దర్శకులు సైతం నిర్మాతలను ఒప్పించలేక, తమ కథలు నచ్చేలా చెప్పలేక అగచాట్లు పడుతున్న ఇన్ని కావు. అయితే వినోద రంగంలో కేవలం సినిమాలే కాదు ఇప్పుడు వెబ్ కంటెంట్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
కాబట్టి కొత్త ప్రతిభ దొరికితే క్రియేటివిటీ ఉన్న కంటెంట్ సృష్టికర్తలు బయటికి వస్తారు. నెట్ ఫ్లిక్స్ అందుకే తెలివైన ఎత్తుగడ వేసింది. తమ వెబ్ సైట్ ద్వారా అప్ కమింగ్ రైటర్స్ కు ఆహ్వానం పలుకుతోంది. స్క్రీన్ రైటింగ్లో మూడు సంవత్సరాల వరకు అనుభవం ఉన్నా లేకపోయినా నేరుగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రాథమిక వివరాలతో కూడిన ఫార్మ్ ఫిలిప్ చేశాక నెట్ ఫ్లిక్స్ ఒక సన్నివేశాన్ని ఇస్తుంది. దాన్ని ఊహించుకుని డైలాగులు, స్క్రీన్ ప్లే రాసి అప్లోడ్ చేయాలి. అది నచ్చితే పిలుపు వస్తుంది.
ఈ ఐడియా ఏదో బాగుంది కదూ. ఎంతసేపు కథల కొరత అంటూ ఈవెంట్స్ లో దర్శక నిర్మాతలు గొంతు చించుకోవడమే కానీ వాటిని వెలికి తీసే ప్రయత్నాలు చేసినవాళ్లు చాలా తక్కువ. ఎంతసేపూ తమను వ్యక్తిగతంగా కలుసుకున్న వాళ్ళను జడ్జ్ చేయడం తప్పించి కొత్తగా ఆలోచించిన దాఖలాలు పెద్దగా ఉండవు. నెట్ ఫ్లిక్స్ ఆ దిశగానే ఆలోచించి పరిష్కార మార్గం కనుక్నే పనిలో పడింది. భాషతో సంబంధం లేకుండా ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఇది క్లిక్ అయితే మటుకు కొన్ని వేల సంఖ్యలో రచయితలు నెట్ ఫ్లిక్స్ కు దొరుకుతారు. అది కూడా కోట్లలో రెమ్యునేషన్లు ఆశించకుండా మంచి అవకాశం దొరికితే చాలని భావించే వాళ్ళు. ఇది మంచి స్ట్రాటజీ. ఊరికే తిప్పించుకోవడం కంటే ఆన్లైన్లో చిన్న పరీక్ష ద్వారా దర్శక రచయితల సామర్ధ్యాన్ని పరీక్షించడం లేని పని. హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించాక నెట్ ఫ్లిక్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఒరిజినల్ కంటెంట్ కోసం వందల కోట్లు బడ్జెట్ సిద్ధం చేసుకుంది.

