నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రభుత్వ బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో బీజేపీ యువజన నాయకుడు అనిల్ శ్రీవాస్తవ ఒక వైద్యురాలిని వేధించి, ఆమెను కాల్చి చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్య సిబ్బందితోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ సంఘటనపై వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. పోలీసులు అనిల్ శ్రీవాస్తవ, అతని అనుచరుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పోస్ట్ వైద్యురాలిని తీవ్రంగా వేధించిన బీజేపీ నేత.. మొదట కనిపించింది నవతెలంగాణ.

