ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా.. మాయ చేయొచ్చు. ఏఐ వచ్చాక చాలా వరకు పనులు సులభం అయ్యాయి. గంటల తరబడి చేయాల్సిన పని నిమిషాల్లో అయిపోతుంది. ఈ కాంట్రాక్టర్లు కూడా అలాగే ఉపయోగించారు. గంటల్లో క్లీన్ చేయాల్సిన చెత్తను నిమిషాల్లో ఎత్తేసి కాలనీలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచారు. వీళ్ల ట్యాలెంట్ కు పై అధికారులు వాహ్వా అంటూ సెల్యూట్ చేసి ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. వివరాలేంటో చూద్దాం.
గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (MCG)లో కాంట్రాక్టర్లు చేసిన ఏఐ మాయాజాలం చర్చనీయంగా మారింది. చెత్త ఎత్తకుండానే, పనులు చేయకుండానే AI ఉపయోగించి ఫేక్ ఫోటోలు అప్లోడ్ చేసి పనిపూర్తయినట్లు రిపోర్టు ఉద్యోగులు ఇచ్చారు. GPS స్పూఫింగ్ ద్వారా హాజరు చూపించిన నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను అధికారులు తొలగించారు.
ప్రజా సేవల్లో టెక్నాలజీ దుర్వినియోగం ఎలా ఈ ఘటన ఉదాహరణ. MCG కమిషనర్ ప్రదీప్ దహియా తెలిపిన వివరాల ప్రకారం, శానిటేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న వసీం అనే ఉద్యోగి చెత్త సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించినట్లు చూపించడానికి AI టూల్స్ ఉపయోగించబడ్డాయి. నకిలీ ఫోటోలు సృష్టించి అధికారిక పోర్టల్‌లో అప్లోడ్ చేశాడు. ఎప్పుడూ సైట్లకు వెళ్లకుండానే.. పని పూర్తయిన ఫోటోలను అప్లోడ్ చేసి చేతులు దులుపుకున్నాడు.
►ఇంకా చదవండి | ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై కంటెంట్గ్రాఫ్ యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు!
మరో ఉద్యోగి సోను GPS స్పూఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి వేరే చోట ఉండి.. వర్క్ లొకేషన్లోనే చూపించాడు అటెండెన్స్ చూపించాడు. జజ్జర్లో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోను.. గురుగ్రామ్‌లో చూపించాడు. ప్రాపర్టీ టాక్స్ డిపార్ట్మెంట్లోని నీరజ్ వశిష్ట్, అంకుర్ అరోరా అనే ఇద్దరు ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రాపర్టీ ID సంబంధిత కేసుల్లో అనవసరమైన అభ్యంతరాలు ఎత్తి చూపడం, నిబంధనలు (SOPలు) పాటించకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి.
అధికారులు డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్‌ల ద్వారా ఈ అక్రమాలను పేర్కొన్నారు. డిజిటల్ సబ్మిషన్లతో పాటు ఫీల్డ్‌లో ఎంక్వైరీ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చినట్లు కమిషనర్ ప్రదీప్ దహియా చెప్పారు.

