పాకిస్థాన్: ఇద్దరు విదేశీ మహిళల్ని నమ్మించి, పాకిస్థాన్ తర్వాత కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మనవడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడితో సహా నలుగురు అనుమానితులను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన నిందితులను మహమ్మద్ రాజా దార్, హసన్ రాజా, సికందర్ ఖాన్, మరియు సాజిద్ అలీగా పేర్కొన్నారు. లాహోర్ కోర్టు శుక్రవారం నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
ప్రధాన నిందితుడు మహమ్మద్ రాజా దార్, ఇతను పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బంధువుని, వరసకు మనవడు అవుతాడని సమాచారం. ఉప ప్రధానితో ఈ కేసు ముడిపడి ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాళ్లలో ఒకరు నెదర్లాండ్స్, మరొకరు వెనిజులకు చెందినవారు. జూన్ 29న లాహోర్‌లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాధితుల్లో ఒకరి తండ్రి స్పెయిన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి తన కుమార్తెకు ప్రమాదం గురించి తెలియజేయడంతో జూన్ 29న లాహోర్‌లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు స్పందించి ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించారు. లాహోర్ పోలీసులు గురువారం ఐదుగురు నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులలో నలుగురిని అరెస్టు చేయగా, ఐదవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇతని కోసం దాడులు చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు అక్టోబర్ 2025లో సింగపూర్‌లో ముహమ్మద్ రాజా దార్‌ను కలిశారు. వీరిద్దరిని పాకిస్తాన్ రమ్మని ఆహ్వానించారు. ఇద్దరు మహిళలను క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసమని నమ్మించి పాకిస్థాన్ రప్పించారు. రాజా దార్ ఇద్దర మహిళలకు బిజినెస్ వీసాలు ఏర్పాటు చేశాడు. జూన్ 29న ఇద్దర కూడా లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, ఒక గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడుదల చేయడానికి నిందితులు డబ్బును డిమాండ్ చేసినట్లు బాధితులు. కోర్టు విచారణ సమయంలో రాజా దార్‌ను ప్రధాన నిందితుడిగా ఇద్దరు మహిళలు పేర్కొన్నారు.

