హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.5.16 లక్షల కోట్లు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాటలు అవాస్తవమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ చేసిన రూ.15 వేల కోట్ల అప్పును కూడా బిఆర్ఎస్ ఖాతాలో చూపించారని. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారిపోవు అంటూ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ.4.14 లక్షల కోట్లు మాత్రమే. కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి పథకాలను కెసిఆర్ అమలు చేశారు. నిధులు లేవని కెసిఆర్ ఏనాడూ సంక్షేమ పథకాలను ఆపలేదు. ఎన్నో ఆనాడు కాంగ్రెస్ నేతలు బాండ్లు రాసారు. కాంగ్రెస్ నేతల అనుభవం స్కామ్‌లు చేసేందుకే ఉపయోగపడుతోంది” అని హరీశ్ ఉడాయించారు.

