వైభవ్ సూర్యవంశీ: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులోకి 15 ఏళ్ల బేబి బాస్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. సంజు శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్, బౌలర్ జోఫ్రా ఆర్చర్లింగ్లో ఒక అద్భుతమైన షాట్‌తో అంతర్జాతీయ క్రికెట్లో తన మొదటి సిక్సర్‌ను నమోదు చేసుకున్నాడు.
148 Kmph వేగంతో బంతికి వైభవ్ కౌంటర్ ఎటాక్:
ఇంటి స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఒక ఓవర్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్చర్ ఏకంగా 148 వేగంతో (148 kmph) బ్యాక్-ఆఫ్-ది-లెంట్ డెలివరీని విసిరాడు. అంతటి వేగంతో దూసుకొచ్చిన బంతిని చూసి ఏమాత్రం భయపడకుండా.. ఈ 15 ఏళ్ల టీనేజర్ లెగ్ స్టంప్ వైపు కొద్దిగా జరిగి, ఒక మోకాలిపై కిందకు వంగి వికెట్ కీపర్ తల మీదుగా లేట్ స్కూప్ షాట్ ఆడాడు. బంతి నేరుగా బౌండరీ అవతలికి వెళ్లి సిక్సర్‌గా పడింది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో:
ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొంటోంది.. అదీ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ ఫియర్లెస్ షాట్‌ను చూసి మాంచెస్టర్ మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో హోరెత్తించారు. ఈ క్లీన్ స్ట్రైక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
14 పరుగులకే వైభవ్ ఔట్:
ఇన్నింగ్స్ 4వ ఓవర్లో అవుట్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు వైభవ్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చాడు. అయితే బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో వికెట్ కీపర్ అతడిని స్టంప్ అవుట్ చేశాడు. వైభవ్ 10 బంతులు ఆడి 2 సిక్సులతో 14 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్-డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌లు భారత్‌ను వేగంగా ముందుకు నడిపించాయి.. అభిషేక్ కూడా 43 పరుగులు చేసిన తర్వాత సామ్ కరన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 65 పరుగులకే కీలకమైన రెండు వికెట్లని కోల్పోయింది.
జాక్స్ 🤝 జోస్
సూర్యవంశీ స్టంప్ ☝️
🏴 🁢 #ENGvIND 🇮🇳 pic.twitter.com/YH1X95fTHh
— ఇంగ్లాండ్ క్రికెట్ (@englandcricket) జూలై 4, 2026
𝐒𝐈𝐗 < 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 ⚡
అందుకు నిదర్శనం #వైభవ్సూర్యవంశీ భిన్నంగా నిర్మించబడింది. 🤯#ENGvIND 2వ T20I 👉 JioHotstarలో ప్రత్యక్ష ప్రసారం! pic.twitter.com/Q5et8S5dXT
— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూలై 4, 2026
𝘼𝙖𝙩𝙚 🚩
ప్రారంభం మాత్రమే, #వైభవ్సూర్యవంశీ భారతదేశం కోసం తన మొదటి ఇంటర్నేషనల్ సిక్స్‌ను బద్దలు కొట్టాడు! 🙌#ENGvIND 2వ T20I 👉 JioHotstarలో ప్రత్యక్ష ప్రసారం! pic.twitter.com/5Qa9iPRJ0x
— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూలై 4, 2026

