రావు బహదూర్ బాక్స్ ఆఫీస్ : సత్యదేవ్ హీరో గా , సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ‘రావు బహదూర్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ, సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో , అలాంటి జానర్ సినిమాలను ఇష్టపడే వారికి , షోస్ గడిచే కొద్దీ , ఆడియన్స్ పెరిగే కొద్దీ బాగా నచ్చేసింది. దీంతో పాజిటివ్ టాక్ జనాల్లో స్థిరపడింది. దీనితో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఓపెనింగ్స్ కంటే , ఓవర్సీస్ లో వచ్చిన ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం మొదటి రోజు ప్రాంతాల వారిగా ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 80 లక్షల రూపాయిల రేంజ్లో గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 65 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 45 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపు 75 లక్షల వరకు ఉండొచ్చు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం ఏకంగా 1 లక్ష 97 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సత్యదేవ్ చిత్రం ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం గతం లో ఎప్పుడూ చూడలేదు. అలాంటి ఓపెనింగ్స్ రావడానికి ఓవర్సీస్ లో మహేష్ బాబు బ్రాండ్ బాగా కలిసి ఉండొచ్చని అంటున్నారు నెటిజెన్స్. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం 17 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
మొత్తం మీద ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 59 గ్రాస్ , 1 కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంత వసూళ్లు రావడానికి ఈ ఓపెనింగ్ ఏ మాత్రం సరిపోదు. కానీ వీకెండ్ లో మొదటి రోజు కంటే రెండవ రోజు , రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి , వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం 50 శాతం రీకవరీ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

