మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో/ మిడ్జిల్: ప్రజా ప్రభుత్వ పాలన ఎందుకు పో వాలి. పేదలకు రేషన్ కార్డులు ఇచ్చారా? సన్న బియ్యం ఇచ్చినందుకా ? మహిళలకు ఉ చితంగా ఆర్టిసి బస్సు ప్రయాణం కల్పించినందుకా? రైతు బంధు, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ ఇచ్చినందుకా? 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకా? ఎందుకు ప్రజా పాలన పోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. తన 20ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహించిన సభలో పాల్గొన్న సిఎం రేవం టి.. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. పాపాల బైరవుడు రావాలి.. రావాలి అంటూ.. కొడుకు అల్లుడు తిరుగుతున్నాడు. ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి? ఫాం హౌ స్లో బందీ అయిన పాపాల బైరవుడు ఎందుకు రావాలి? అనే చర్చ పెట్టాలని ప్రజలకు రేవంత్ హాజరు. తెలంగాణ పదేళ్ల పాలనలో 8 లక్షల కోట్లు అప్పుల పాలయ్యింది… కెసిఆర్ మాత్రం లక్ష కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.
అహంకారానికి, అంహంభావానికి ఒక హద్దు ఉంటుందని, దానిని అతిక్రమిస్తే ప్రజలు ఊరుకోరని సిఎం హెచ్చరిక. పాలనకు పాలమూరు బిడ్డ పనికి రాడని అన్నారు. రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. కొడుకు, కూతురు,అల్లుడుకి వేలాది ఎకరాల్లో ఫాం హౌస్‌లు ఎలా వచ్చాయి అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళిత, డబుల్ బెడ్ రూం ఇళు,ల దళితునికి మూడెకరాల భూమి, కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి కెసిఆర్ మోసం చేశారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో నీళ్లు, నిధులు ఇవ్వలే , నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎందుకు వీళ్లు మళ్లీ రావాలని నిలదీశారు. మా ప్రభుత్వంలో రైతులకు భరోసా, రైతు బీమా కింద వేల కోట్లు ఖర్చు చేసింది. రైతులు పండించిన చివరి గింజ వరకు రైతుల ఖాతాల్లో రూ. 80 వేల కోట్లు వేసినందుకా? గంజాయి, డ్రగ్స్, అమ్మేవాళ్లను జైల్లో పెట్టించినందుకా ? ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. వాళ్ల సంపాదన, దోపిడీ దొంగతనాలు ఆగిపోయాయని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని సిఎం ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో ఏ వ్యాపారం చేశారని మీకు అన్ని వేల కోట్ల సంపాదన ఎలా వచ్చిందని ప్రశ్నించారు .
బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ. 8 లక్షల 21 వేల కోట్లు ఎలా వచ్చాయి. అప్పులు తప్పులు చేసిన వాళ్లు మళ్లీ వస్తే ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితులు వస్తాయని అన్నారు. చివరికి ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిషేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాడు. ప్రజా సమస్యలు ప్రస్తావించాడు. అధికారం ఇస్తే దోచుకునేందుకు వస్తాడంటూ కెసిఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పశుపతి ఫామ్ హౌస్‌లోనే కృంగి కృషించి పోవాలని అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసిన తక్కువేనని హెచ్చరించారు. గ్రామాలు బాగుంటే నియోజకవర్గాలు, రాష్ట్రం దేశం బాగుందన్నారు. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సిఎం అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే భాద్యత తీసుకుంటానని అన్నారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు.. ఆయన ప్రధాని కావడం చారిత్రక అవసరమని అన్నారు. దీని కోసం ప్రజలు తన వెంట నడవాలని. ఈ మిడ్జిల్ నుంచే మొదటి అడుగు పడాలని.
మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా తక్కువే
రాజకీయంగా తనకు జన్మనిచ్చిన మిడ్జిల్ మండలంపై సిఎం మమకారాన్ని పంచారు. మిడ్జిల్ మండలానికి ఏమి ఇచ్చినా తక్కువే. చివరికి తన ప్రాణం ఇచ్చిన తక్కువేనని సిఎం అన్నారు. వలస పాలమూరును అభివృద్ది చేయాల్సిన బాధ్యత తనపై ఉంది. నా ఆత్మ బంధువులు, మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. 20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. జిల్లాకు గొప్ప నాయకత్వం బాధ్యత నిర్వహించిన అనుభవం ఉందని సిఎం అన్నారు.
హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్దుల రామకృష్ణారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న జైపాల్ రెడ్డి ఈ గడ్డనే అన్నారు. జైపాల్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి తోడ్పాటు అందించిన ద్యాప గోపాల్ రెడ్డి మిడ్జిల్ బిడ్డనేనని అన్నారు. మిడ్జిల్ నుంచి తనను జడ్పిసిగా పంపించి రాజకీయంగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి దత్తత తీసుకోవాలని, ప్రతి పల్లె, వార్డు అభివృద్ధి ఆయన ఉప ముఖ్యమంత్రికి సూచించారు. సంక్షేమ అభివృద్దితో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సిఎం తెలిపారు.
ప్రజల ఆకలి, కష్టాలు తెలిసిన నేత సిఎం: డిప్యూటీ సిఎం
సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జడ్పీటీసీ సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, నేడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన ఎదుగుదల అసాధారణమైనదని అన్నారు.అధికారం అంటే కేవలం నలుగురు అధికారులను గదిలో పోగేసుకొని చర్చలు జరపడం మాత్రమే కాదని, క్షేత్రస్థాయిలో ప్రజలు గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలు, ఆకలి తెలిసిన నేత అని సిఎంను బట్టి విక్రమార్క ప్రశంసించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపిలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహదారుడు జితేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు మధుసూధన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనురుధ్ రెడ్డి, వంశీకృష్ణ, ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ చైర్మన్లు పనిచేస్తున్నారు.

