- కుటుంబ ఆదాయంలో 41 శాతం హోమ్ లోన్ ఈఎంఐలకు పెట్టాల్సిందే
- టాప్‌లో ముంబై, ఢిల్లీ.. 65 సంవత్సరాలకు పైగా ఈఎంఐలకు కట్టగలిగితేనే ఇల్లు
- అత్యంత అఫర్డబుల్ సిటీలు అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె
- ఫ్రాంక్ ఇండియా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ అత్యంత ఖరీదుగా మారింది. ఇక్కడ ఇల్లు కొనాలంటే కుటుంబం తన ఆదాయంలో 41 సంవత్సరాలకు పైగా నెల కిస్తీకి కట్టాలి. అంటే, ఈ సిటీలో సొంతిల్లు కొని, ఈఎంఐల కోసం ఆదాయంలో దాదాపు సగం వాటా కేటాయించాలన్న మాట.
దేశంలోని టాప్ 8 సిటీలతో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా హైదరాబాద్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఈ సంస్థ తాజాగా ‘అఫార్డబిలిటీ ఇండెక్స్’ను విడుదల చేసింది. దీని ప్రకారం రెపో రేటు 125 బేసిస్ పాయింట్ల (1.25 శాతం) మేర తగ్గడంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు దిగొచ్చాయి.
ఇతర నగరాల్లో పరిస్థితులు ఇలా..
దేశంలో సర్వే చేసిన 8 ప్రధాన నగరాల్లో 6 నగరాల ప్రజలు ఇళ్లు కొనగల స్తోమత స్థాయిలోనే (50 శాతం లోపు) ఉన్నారు. అయితే ముంబై, ఢిల్లీ– ఎన్సీఆర్ మాత్రం 50 శాతం పరిమితి కంటే ఎక్కువ శాతం, ఇళ్లు కొనడానికి అత్యంత భారంగా ఉన్న నగరాలుగా కొనసాగుతున్నాయి.
దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఇళ్లు దొరికే నగరంగా అహ్మదాబాద్. ఇక్కడ ఒక కుటుంబం ఆదాయంలో కేవలం 23 శాతం మాత్రమే ఈఎంఐకి సరిపోతుంది. 25శాతంతో కోల్‌కతా రెండో స్థానంలో, 28శాతంతో పుణె మూడో స్థానంలో ఉన్నాయి.
గత పదేళ్లలో పరిస్థితి ఇలా….
గత పదేళ్లలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్లు కొనే స్తోమత నిరంతరం మెరుగుపడుతూ వచ్చింది. ముఖ్యంగా కణితి సమయంలో ఆర్బీఐ రెపో రేటును పదేళ్ల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించడంతో ఇళ్లు కొనడం మరింత సులువైంది. తదనంతరం ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) కారణంగా, మే 2022 నుంచి తొమ్మిది నెలల్లో రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో 2022లో ఇళ్లు కొనడం భారంగా మారింది.
2023 ప్రారంభం నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి, ఇళ్ల ధరలు పెరగడం వల్ల ముఖ్యంగా ఢిల్లీ–ఎన్సీఆర్ లాంటి ఇళ్ల కొనుగోలు భారం ఎక్కువగా ఉంది. ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లను మొత్తంగా 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో హోమ్ లోన్ ఈఎంఐల భారం దిగొచ్చింది.
“రెసిడెన్షియల్ మార్కెట్ వృద్ధి చెందడానికి ప్రజల కొనుగోలు శక్తి అత్యంత కీలకమైనది. తక్కువ వడ్డీ రేట్లు ఉంటే ఈ ఏడాది గృహాల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతాయి

