జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’.ఈ సినిమా ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ రూపొందారు. ఊర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా ఉన్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శనివారం సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘కిల్లర్’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సూపర్ ఉమెన్ గా, మిస్టీరియస్ ఉమెన్‌గా జ్యోతి పూర్వజ్ ఎలక్ట్రిఫైయింగ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. ‘కిల్లర్’ సినిమా ప్రేక్షకులు మర్చిపోలేని ఒక ప్రపంచాన్ని డైరెక్టర్ పూర్వాజ్ సృష్టించారు. పూర్వాజ్ మాట్లాడుతూ “మా ‘కిల్లర్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయింది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి మా సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి తీసుకొస్తాం” అని అన్నారు.

