బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నారు. 47 సంవత్సరాల వయసున్న గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న అమీర్ ఖాన్ నివాసంలో శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వివాహ పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రియమైన అమీర్ భాయ్ & గౌరీ,
మీ వివాహానికి హృదయపూర్వక అభినందనలు! ❤️ మీ ఇద్దరికీ జీవితాంతం ప్రేమ, ఆనందం, నవ్వు మరియు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అల్లా మీ అందమైన ప్రయాణాన్ని అంతులేని ఆనందం మరియు లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు.
మీ ఇద్దరికీ చాలా సంతోషంగా ఉంది, మరోసారి అభినందనలు! pic.twitter.com/b6NVEoUw34
— ఇర్ఫాన్ పఠాన్ (@IrfanPathan) జూలై 5, 2026
ఈ పెళ్లికి విదేశాల నుంచి ఇరు కుటుంబాల దగ్గరి బంధువులు కూడా వచ్చారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సహా సుమారు 150 మంది అతిథులు మాత్రమే హాజరు కావడం విశేషం. మూడో పెళ్లి కావడంతో నిరాడంబరంగా ఈ తంతు కానిచ్చేయాలని అమీర్ ఖాన్ భావించారు. హాజరైన వారిలో అమీర్ పిల్లలైన జునైద్, ఇరా, ఆజాద్‌లతో పాటు గౌరీ కొడుకు కూడా ఉన్నాడు. 2026లోనే అమీర్, గౌరీ తమ సంబంధాన్ని ధృవీకరించారు. తాము దాదాపు పాతికేళ్లుగా ఒకరికొకరు తెలిసినప్పటికీ, కేవలం రెండేళ్ల క్రితమే డేటింగ్ ప్రారంభించినట్లు అమీర్ ఏర్పాటు.
61 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్ 3వ హిందూ మహిళలతో 3వ వివాహం చేసుకున్న సందర్భంగా ఆమె 2వ మాజీ భార్య కిరణ్ రావుకు బహిరంగంగా ముద్దులు ఇస్తున్నారు😭
ఈ మహిళలు తన మాజీ భర్త వివాహానికి హాజరు కావడం ఇబ్బందికరం కాదా❓ pic.twitter.com/KjYIB5A1oE
— భక్త్ ప్రహ్లాద్🚩 (@RakeshKishore_l) జూలై 5, 2026
అమీర్ గతంలో నిర్మాత రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన 2005లో చిత్ర నిర్మాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2021లో విడిపోయారు. తమ కుమారుడు ఆజాద్‌ను కలిసి పెంచుతున్నారు.
►ఇంకా చదవండి | బ్రేక్ ఫాస్ట్ సినిమా అందరికీ ఎక్కుతుందా..? ఓటీటీలోకి వచ్చిందిగా.. చూడొచ్చా..?
ఇక గౌరీ స్ప్రాట్ విషయానికొస్తే.. ఆమెకు కూడా ఇది వరకే పెళ్లైంది. భార్యాభర్త చట్టప్రకారం విడిపోయారు. వీరికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. బెంగళూరుకు చెందిన గౌరీ మీడియా ముందు పెద్దగా కనిపించలేదు. ఆమె మాజీ సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కూతురు. వెల్నెస్, బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లెంట్ సెలూన్‌ను నడుపుతోంది.

