నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ పాత వార్తాసంస్థ సంతోష్ నగర్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆహ్వాన సంఘం సమావేశాన్ని ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన మలక్ పేట్ లోని ఫెర్న్ హిల్స్ స్కూల్ లో ఆదివారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రొ. శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, ఆవాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ నాయక్, పీర్యా నాయక్, ఎం బాలు నాయక్, రాంకుమార్ నాయక్, ఆంగోత్ కృష్ణా నాయక్, భూక్యా వీరభద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూగులోత్ నాయక్ నాయకులు,ఉద్యోగులు ఉంటారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అంతరిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరు మీద నంగారా ఉత్సవాలు నిర్వహించడం చాలా మంచి పరిణామమన్నారు. లంబాడి గిరిజనుల సంస్కృతి ఎంతో ఉన్నతమైందని వాటిని చాటి చెప్పేలా జరగాలన్నారు. గిరిజన సంఘానికి ఎంతో చరిత్ర ఉన్నదని గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత ఈ సంఘానికి ఉందని కొనియాడారు. భూమి కోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతు పోరాటం లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంపిణీ చేయబడింది అంతటి వారసత్వాన్ని ఉనికిలో ఉన్న ఠానూ నాయక్ త్యాగాలు భావితరాలకు స్పూర్తిదాయకమన్నారు.
భారతీయ బిజెపి గిరిజన హక్కులను కాలరాస్తూ వారి సంస్కృతిపై దాడి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేవెళ్ల డిక్లరేషన్లో 15 రకాల గిరిజన హామీలను అమలు చేసిందని ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ప్రతి గిరిజన తండా,గూడెం పంచాయతీలకు ప్రతి ఏటా 25, మైదాన ప్రాంతంలో ఐటిడిఏలను ఏర్పాటు చేస్తామన్న హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ పాత నగరంలో గిరిజన సంఘం మహాసభలు ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారని అన్నారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగే ఉత్సవాలను జయప్రదం కోసం రాష్ట్రంలోని గిరిజన కళాకారులు, కళాబృందాలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. గిరిజనుల పండగలా నిర్వహించాలని లక్ష్యంతో జరుగుతున్న ఈ మహాసభల ఉత్సవాల జయప్రదానికి గిరిజన ఉద్యోగులు, మేధావులు, శ్రేయోభిలాషులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఆహ్వాన సంఘం ఏర్పాటు..
చైర్మన్ గా – డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డా.రామచందర్ నాయక్
కో-చైర్మన్ -డిప్యూటీ డిసిపి ట్రాఫిక్ రాందాస్ తేజ
అధ్యక్షులు– మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
ప్రధాన కార్యదర్శిగా ఎం బాలు నాయక్, కోశాధికారి రాంకుమార్, ఉపాధ్యక్షులు అంగోత్ కృష్ణానాయక్ లతో పాటు 250 మంది గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మేధావులతో ఆహ్వాన సంఘం ఏర్పడింది.
పోస్ట్ ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు..ఆహ్వాన సంఘం ఏర్పాటు మొదట కనిపించింది నవతెలంగాణ.

