బలూచిస్తాన్ : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమం ఇప్పుడు కొత్త రూపం తీసుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్ భద్రతా దళాలను మాత్రమే కాకుండా, చైనా ప్రయోజనాలను కూడా నేరుగా లక్ష్యంగా చేసుకుంటుంది. ఇటీవలి దాడులు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఐసీ) ప్రాజెక్టుల భద్రతపై ఇది తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
జీవానీలో దాడి..
జివానీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘటనలో బీఎల్ఏ పాకిస్థాన్ సైన్యానికి చెందిన రాడార్, ఎయిర్ స్టేషన్ ఔట్‌పోస్టుపై దాడి చేసింది. ఈ సమీపంలో చైనాకు సంబంధించిన స్థావరం ఉండటం వల్ల ఈ దాడి చైనాపై కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు విశ్లేషకులు నిర్ధారించారు. గ్వాదర్పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దాడి, హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటం వల్ల వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఎల్ఏ మందుగుండు వాహనంతో ఆత్మాహుతి దాడి చేసినట్లు సమాచారం. దీనితో పాకిస్తాన్ భద్రతా దళాల్లో భారీ ప్రాణనష్టం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు బీఎల్ నాలుగైదు ప్రధాన వంతెనలను పేల్చివేసి, ఇప్పుడు తీర భద్రతా దళాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. బీఎల్ఏ తన స్వంత నేవీ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటనలు వచ్చాయి. గతంలో కోస్ట్ గార్డ్ సిబ్బందిపై దాడులు జరిగాయి, ముగ్గురిని చంపినట్లు బీఎల్ఏ గుర్తించింది.
చైనాకు హెచ్చరిక..
చైనా ఇప్పటికే పాకిస్తాన్ భద్రతా ఏర్పాట్లపై నమ్మకం కోల్పోయింది, తన స్వంత రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. అయినప్పటికీ, ఇలాంటి ప్రశ్నలు చైనా పెట్టుబడుల భద్రతను కలిగి ఉన్నాయి. చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో కీలక భాగం. గ్వాదర్పోర్టు ద్వారా చైనాకు అరేబియన్ సముద్రంలో ప్రత్యక్ష ప్రవేశం లభిస్తుంది. ఈ ప్రాంతంలో దాడులు పెరగడం వల్ల ప్రాజెక్టుల అమలు ఆలస్యం కావడం, ఖర్చులు, పెట్టుబడిదారుల నమ్మకం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బీఎల్ఏ దాడులు ఇప్పుడు చైనా నియంత్రణలో ఉన్నట్లు భావించే ప్రాంతాలకు విస్తరించాయి. ఇది చైనా ప్రణాళికలను భంగపరచడమే కాకుండా, పాకిస్తాన్‌తో చైనా సంబంధాలను కూడా పరీక్షిస్తోంది. చైనా ఇప్పటికే ఉలిక్కిపడి, భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసుకుంటోంది.
బీఎల్ ఏ వ్యూహాత్మక దాడులు..
బీఎల్ఏ దాడులు ఇప్పుడు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా మారాయి. గ్వాదర్పోర్టును తదుపరి టార్గెట్‌గా ఎంచుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. బీఎల్ఏ తన దాడుల వీడియోలు, సాక్షాలతో సహా విడుదల చేస్తోంది. దీని వల్ల ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోంది. అయితే పాకిస్థాన్ అధికారులు ఈ ఘటన గురించి బహిరంగంగా మాట్లాడడం లేదు. పత్రికల్లో కూడా విస్తృతంగా కవరేజ్ రావడం లేదు. ఇది ప్రభుత్వం దాడుల పరిమాణాన్ని తక్కువ చేయడానికి లేదా చైనా పెట్టుబడులపై నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, బీఎల్ఏ ప్రచారం వల్ల వాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్నాయి.
దాడుల వెనుక అమెరికా..
ఈ దాడుల నేపథ్యంలో అమెరికా బలూచ్ ఉద్యమానికి మద్దతు ఇస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది చైనా అడ్డుకోవడానికి భాగంగా ఉండేందుకు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి ఇప్పటికి అనుమానాలే. చైనా బలూచిస్తాన్ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో బీఎల్ఏ ఈ దాడులు చేస్తోందని కూడా భావన ఉంది. గ్వాదర్పోర్ట్, సమీప ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు కొనసాగితే, చైనా తన ప్రాజెక్టులను లేదా పునఃసమీక్షించవచ్చు భద్రతా ఖర్చులను బాగా పెంచవచ్చు.
బలూచిస్తాన్ సమస్య ఇప్పుడు స్థానిక స్థాయిని దాటి ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తోంది. చైనా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి, భద్రతా సవాళ్లు రెండు దేశాలను కూడా ఒత్తిడిలోకి తెస్తున్నాయి. బీఎల్ఏ దాడులు ఇలాగే కొనసాగితే, సీపీఐసీ ప్రాజెక్టుల వేగం మందగించడం, ప్రాంతీయ అస్థిరత పెరగడం తప్పదు. ఈ పరిస్థితి బలూచిస్తాన్‌లోని స్థానిక గుర్తింపు, వనరుల పంపిణీ సమస్యలను పరిష్కరించకపోతే, మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

