స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణం లాంటి పెద్ద సినిమాలో నటించినప్పుడు వారి ఇమేజ్‌కు తగ్గా పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవ్వడం సహజం. పాత్ర స్క్రీన్ టైం తక్కువ ఉన్నా, ఆ క్యారెక్టర్‌కు ప్రాధాన్యం లేకపోయినా.. అభిమానులు నిరాశ చెందడంతో సోషల్ మీడియాలో, మీడియాలో నెగెటివ్ కామెంట్లు పడిపోతాయి. ఐతే కొన్ని సార్లు మేకింగ్ టైంలో ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించినా.. ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలకు కోత పడిపోవడం వల్ల పాత్రల ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది.
కొన్నిసార్లు మేకింగ్ టైంలోనే తమ పాత్రలకు ఆశించిన ప్రాధాన్యం లేదని ఆర్టిస్టులకు అర్థమైపోతుంటుంది. అలాంటపుడు అభిమానులను ముందే ప్రిపేర్ చేయటం మంచిదే. కాజల్ అగర్వాల్ ఈ పనే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆమె ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం రామాయణలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న యశ్‌కు జోడీగా మండోదరి పాత్రలో కనిపించనుంది కాజల్. మామూలుగా రామాయణం కథను పరిశీలించినా.. దాని మీద వచ్చిన సినిమాలను గమనించినా.. మండోదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. కొత్త రామాయణం కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండదని స్పష్టమవుతోంది.
కాజల్ స్వయంగా తన పాత్ర చిన్నదే అంటూ ముందే హింట్ ఇచ్చేసింది. రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఒక భాగం షూటింగ్ పూర్తయిందని, లంకలో వచ్చే సన్నివేశాలే తక్కువ అని, తన పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని కాజల్ చూపడం.
తన పాత్ర చిన్నదే అయినా.. ఇలాంటి మెగా ప్రాజెక్టులలో భాగం కావడమే అదృష్టమని కాజల్ వ్యాఖ్యానించింది.
యశ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నార కాజల్ ముందే హింట్ ఇచ్చేసింది కాబట్టి.. రేప్పొద్దున రామాయణంలో ఆమెది చాలా చిన్న పాత్ర అని ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిన అసవరం లేదు. అయినా కెరీర్లో ఈ దశలో కాజల్‌కు ఇలాంటి ప్రాజెక్టుల్లో చిన్న పాత్ర అయినా దక్కడం గొప్పే అనుకోవాలి.

