ఈజిప్ట్ మిలిటరీ: ప్రపంచ పెద్దన్న అమెరికా. ఆర్థికంగా, సైనిక పరంగా, ఆయుధ శక్తి పరంగా ఇలా అన్నింటిలో మొదటి స్థానంలో ఉంది. అయితే మారుతున్న పరిణామాలతో అగ్రరాజ్యం కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. మళ్ళి కొన్ని దేశాలు అమెరికాను అధిగమించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ తాజాగా ఈజిప్టు ఇటీవల కైరో సమీపంలోని న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్లో ‘ఆక్టగాన్’ అంటే అత్యాధునిక రక్షణ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక–రక్షణ ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందింది. అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి దీన్ని ఉన్నతమైన జాతీయ కట్టడంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ఈజిప్టు సాయుధ కేంద్రీకృత నిర్వహణను బలోపేతం చేస్తూ, ఆధునిక సైనిక వ్యవస్థకు కొత్త దిశను సూచిస్తోంది.
ఆక్టగాన్ అంటే ఏమిటి?
ఆక్టగాన్ (స్టేట్ స్ట్రాటజిక్ కమాండ్ సెంటర్) ఈజిప్టు రక్షణ శాఖ, సాయుధ సైనికకు కేంద్రీకృత ప్రధాన కార్యాలయం. ఇది ఒకే స్థలంలో అన్ని సైనిక శాఖలు, ఇంటెలిజెన్స్, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను సమన్వయం చేసేలా రూపొందించబడింది. దీని నిర్మాణం ఆక్టగాన్ (ఎనిమిది భుజాల) ఆకారంలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది సంక్షోభ నిర్వహణ, సమాచార వినిమయం, ఆపరేషనల్ సమన్వయానికి ఒక సమగ్ర వేదిక.
నిర్మాణ విశేషాలు..
ఈ కాంప్లెక్స్ కైరోలో సుమారు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బహుళ భవనాలు, డేటా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడింది. దీని ఉద్దేశం పాత కైరోలోని రద్దీని తగ్గించి, ఆధునిక, సురక్షితమైన వాతావరణంలో సైనిక–పరిపాలనా కార్యాలను కేంద్రీకరించడం.
పెంటగాన్ కన్నా పెద్దది..
అమెరికాలోని ప్రసిద్ధ పెంటగాన్ భవనం కేవలం 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు కలిపినా సుమారు 41 ఎకరాలకు మించదు. ఆక్టగాన్లో 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పెంటగాన్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు చిహ్నం అయినప్పటికీ, ఆక్టగాన్ భౌతిక పరిమాణం, కేంద్రీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతికతలతో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇది భౌతిక విస్తీర్ణంలోనే కాకుండా, ఏకీకృత కమాండ్ వ్యవస్థలో కూడా ప్రత్యేకతను చూపుతుంది.
సాయుధ శక్తికి వ్యూహాత్మక కేంద్రం..
ఈజిప్టు సాయుధ దళాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో అతిపెద్ద వాటిలో ఒకటి. టగాన్ ఈ ప్రదర్శన ఒకే కేంద్రం నుంచి నియంత్రించడానికి, సమన్వయం చేయడానికి, సంక్షోభ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి. ఇది సాంప్రదాయిక సైనిక కార్యాలయాల నుండి ఆధునిక, సమగ్రమైన వ్యవస్థకు మార్పును సూచిస్తుంది. జాతీయ భద్రత, సరిహద్దు రక్షణ, అంతర్గత స్థిరత్వం వంటి అంశాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఈజిప్టు ‘న్యూ రిపబ్లిక్’ విజన్లో భాగం..
ఇది సైనిక ఆధునీకరణ, ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధి, జాతీయ గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఆర్థిక వనరులు, నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యాలపై ఆధారపడిన.న్యూ క్యాపిటల్ మొత్తం ప్రాజెక్టు ఖర్చులు, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ కేంద్రం దీర్ఘకాలికంగా ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూడాలి. అయినప్పటికీ, ఇది ఈజిప్టు సైనిక మరియు జాతీయ ప్రపంచ వేదికపై మరింత బలపరుస్తుందనడంలో సందేహం లేదు.
ఆక్టగాన్ ప్రారంభం ఈజిప్టు చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇది కేవలం ఒక భవనం కాదు – జాతీయ సార్వభౌమత్వం, సైనిక సామర్థ్యం, ఆధునిక దృక్పథానికి సంకేతం. ప్రపంచ రక్షణ రంగంలో ఈసారి మరింత శక్తివంతమైన ఆక్రమించే అవకాశం ఉంది.

