ఆంధ్ర ప్రదేశ్ : తెలుగుదేశం పార్టీ లో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నామినేటెడ్ పదవి దక్కే అవకాశంపై చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం పార్టీ లో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నామినేటెడ్ పదవి దక్కే అవకాశంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయిన వెంటనే బుద్దా వెంకన్నకు మరోసారి పార్టీ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నప్పటికీ ఆయనకు అనేక అవరోధాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ ప్రాంతం నుంచి అనేక మంది స్థానాల కోసం పోటీలో ఉన్నారు. మరి బుద్దా వెంకన్న పేరును పార్టీ నాయకత్వం ఏ మేరకు తీసుకుంటుందన్నది సందేహంగానే ఉంది. పదవుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు అనేక మంది పోటీ పడుతున్నారు. అందుకే ఆయనకు ఈసారి ఎమ్మెల్సీ పదవి లభిస్తుందా? లేదా?అన్నది డౌట్ కొడుతోంది. త్వరలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.
సముచితం స్థానం కల్పించాలని ఉన్నా…
బుద్ధా వెంకన్న పార్టీ కోసం ఆయన చేసిన సేవలు, పార్టీ అధిష్టానం సానుకూలత దృష్ట్యా, త్వరలో ప్రకటించే వివిధ కార్పొరేషన్ లేదా నామినేటెడ్ పదవుల్లో ఆయనకు సముచిత స్థానం దక్కని పార్టీ వర్గ చర్చ జరుగుతోంది. అయితే, పార్టీ బలోపేతానికి, అధినేత చంద్రబాబుకు అండగా నిలిచిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. త్వరలోనే ఆయనకు కీలకమైన నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు అంటున్నప్పటికీ పదవి దక్కేంత వరకూ అనుమానంగానే ఉంది.
నమ్మకమైన నేతగా…
బుద్దా వెంకన్న పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నమ్మకమైన నేతగా ఉన్నారు. పార్టీ కోసం విజయవాడలో బలమైన నేతగా అందులో బుద్దా వెంకన్న ముద్రపడ్డారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు సన్నిహితుడిగా కూడా పేరుంది. వారిని విమర్శిస్తే వెంటనే రంగంలోకి దిగి విమర్శలు చేయడం బుద్ధా వెంకన్న నైజం. అయితే విజయవాడ నుంచి వంగవీటి రాధా పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన కాపు సామాజికవర్గం నేత కావడంతోపాటు రంగా తనయుడు కావడంతో అదనపు బలం. మరొకవైపు ఎమ్మెల్సీగా పంచుమర్తి అనూరాధ ఉన్నారు. అలాగే రాజ్యసభ ఆశించి పొందలేకపోయిన వర్ల రామయ్య పేరు కూడా ఈసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ఎంపిక అవుతారు. దీంతో విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్నకే పదవులు ఇస్తే ప్రాంతాల పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
వార్తల సారాంశం – ఆంధ్రప్రదేశ్‌లో బుడ్డ వెంకన్నకు నామినేటెడ్ పదవి వస్తుందా?

