ఆంధ్రప్రదేశ్: అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కు త్వరలోనే కేంద్ర మంత్ర పదవి దక్కబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే కేంద్రవర్గ విస్తరణ జరుగుతుందని ఈసారి సీఎం రమేష్ కు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి. సీఎం రమేష్ కు బీజేపీలో ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వానికి నమ్మిన బంటుగా ఉన్నారు. కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆపరేషన్ ను సీఎం రమేష్ సమర్ధవంతంగా పూర్తి చేశారు. అందుకే మోదీ, షాలు బహుమతిగా సీఎం రమేష్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం టీఎంసీ సభ్యులను చీల్చి పార్టీకి చేరువ చేయడంలో సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు. కోల్ కత్తాలోనే సీఎం రమేష్ కొన్ని రోజుల పాటు మకం వేసి టీటీడీ ఎంపీలను పార్టీని వీడేటట్లు చేయడంలో సక్సెస్ అయ్యారు. నిజానికి 2024 ఎన్నికలలో అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన స్థానాలను బీజేపీ తెచ్చుకోలేకపోయింది. దీంతో జేడీయూ, టీడీపీ మద్దతు పై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఇకపై ఎవరిపైనా ఆధారపడకుండా తాము సొంతంగా బలపడేందుకు పార్టీ నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను తీసుకుని వచ్చే బాధ్యతను సీఎం రమేష్ కు అప్పగించారు. దీనిని సక్సెస్ ఫుల్ గా సీఎం రమేష్ చేయడంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటున్నారు.
మరొకవైపు పార్లమెంటులో కీలక బిల్లులు వీగిపోయిన నేపథ్యంలోనూ ఎంపీల అవసరం పార్టీ నాయకత్వానికి తెలిసొచ్చింది. సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఆయన తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వంతో చెలిమిని పెంచుకున్నారు. మరొకవైపు కాపు సామాజికవర్గం నేత కావడం కూడా సీఎం రమేష్ కు కలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. సీఎం రమేష్ కాపు సామాజికవర్గం నేత మామత్రమే కాకుండా, అనకాపల్లికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ రాయలసీమకు చెందిన నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సీఎం రమేష్ లక్కు ఎలా ఉంటుందన్నది చూడాలి.

