ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు (డీ వాటరింగ్) అధికారులు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్-1 ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ మరియు ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) వారితో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసిన అనంతరం డీ వాటరింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగింది.
ప్రాజెక్టు పరిధిలోని నీటిని వేగంగా తోడేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 240 మోటార్లను ప్రాజెక్టు నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మోటార్ల నడపన పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా రోజుకు దాదాపు ఏడొందల క్యూసెక్కుల నీటిని తోడి అవతలకు పంపే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం అత్యంత శక్తివంతమైన మోటార్లను రంగంలోకి దించారు. వీటిలో కొన్ని 88 హార్స్ పవర్ (HP) సామర్థ్యం కలిగి ఉండగా, 83.5 హార్స్ పవర్ సామర్థ్యంతో పనిచేస్తాయి. డీ వాటరింగ్ పనుల మొదటి రోజున ప్రయోగాత్మకంగా 40 మోటార్లను ప్రారంభించి నీటిని తోడటం మొదలుపెట్టారు.
రాబోయే రోజుల్లో అక్కడ ఉండే అవసరాన్ని బట్టి, నీటి నిల్వలను బట్టి మిగిలిన మోటార్లను కూడా విడతలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చి నడుపుతున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ముందుచూపుతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న పనులు పూర్తి తోడేయడం వల్ల నిరంతరాయంగా సాగుతాయి. రాబోయే కాలంలో దిగువ, కాఫర్ డ్యామ్ల పరిసర ప్రాంతాలు కూడాసీఆర్ఎఫ్ (ECRF) పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ డీ వాటరింగ్ ప్రక్రియను మరింత ముమ్మరంగా కొనసాగిస్తుంది.

