Pradeep Ranganathan : డైరెక్టర్ గా హీరో గా ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్టర్ గా ఆయన మొదటి చిత్రం ‘కోమలి’ సూపర్ హిట్ అయ్యింది . ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించూ హీరోగా చేసిన ‘లవ్ టుడే’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఇతర డైరెక్టర్స్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన ‘LIK’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇకపోతే నేడు ఆయన తదుపరి నేడు ఒక బ్లాస్టింగ్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈసారి డైరెక్టర్ గా , హీరో గా కాదు , నిర్మాతగా.
ఆయన నిర్మాతగా ఒక లేడీ ఓరియెంటెడ్ ని చేయబోతున్నట్టు తాజాగా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ , నేడు ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా ప్రకటించారు. ‘PR షో’ అనే బ్యానర్ పై ఈ క్రేజీ మూవీని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం కథ కూడా ఆయనే అందించారు. ఈ చిత్రంలో ఒకరు కాదు, ఆల్ఫా యూనిట్ ద్వారా ఏకంగా 6 మంది దర్శకులు దర్శకత్వం వహించనున్నారు. సాయి అభయంకర్ సంగీత దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అనామిక మహి , స్వశిక , డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు , శివాజీ కీలక పాత్రలు పోషించనున్నారు. ఒక సినిమాకు ఏకంగా 6 మంది దర్శకత్వం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి.
ప్రదీప్ ఈ విధంగా ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నారని చెప్పాలి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా సక్సెస్ అవుతారో చూడాలి. ఇకపోతే ఆయన హీరో గా నటించే సినిమాల వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం , నిర్మాతగా వ్యవహరించబోయే ఈ సినిమా మీదనే ఉంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అస్వత్ మారిముత్తు గతం లో ప్రదీప్ ని హీరోగా పెట్టి ‘డ్రాగన్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘ధర్మన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతుండడం.
‘PR షో’ అది
https://t.co/ojsSJlBynP#PRS1 #PRNEXTWAV
ఆల్ఫా యూనిట్ రచన & దర్శకత్వం
బ్యానర్: @prshowofficial
కథ మరియు నిర్మాత: @ప్రదీపోనెలైఫ్
ఎ @సాయిఅభ్యాంకర్ సంగీతపరమైన@_mamithabaiju @Dir_Ashwath @DKP_DOP @ప్రదీప్ ఈరాగవ్ #రమేష్ నారాయణన్…— ప్రదీప్ రంగనాథన్ (@pradeeponelife) జూలై 6, 2026


