కుమురంభీం: పదో తరగతి విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి అనంతరం బలవంతంగా ఆమె నోట్లు పెన్ను క్యాప్ పెట్టి నీళ్లు పోయడంతో ఆమె మింగేసింది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో జరిగింది. విద్యార్థిని తండ్రి తెలిపిన వివరాల ప్రకారం….. దిరగాం రోడ్డులో మహాత్మా జ్యోతిరావుబాపులే బాలిక గురుకుల విద్యాలయంలో ఉషాన్ శృతి అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. సహచర విద్యార్థులు ఉషాన్ కళ్లకు గంతలు కట్టి అనంతరం బలవంతంగా నోట్లోకి పెన్ను క్యాప్ కుక్కి నీళ్లు పోశారు. విద్యార్థికి ఊపిరాడేసింది క్యాప్‌ను మింగేసింది. వెంటనే ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడంతో గురుకుల పాఠశాలకు చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. స్కానింగ్ చేయగా కడుపులో క్యాప్ ఉన్నట్లు తేలింది. చికిత్స చేసి క్యాప్‌ను ఆమె కడుపులో నుంచి బయటకు తీశారు.

