సియాటెల్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఊహించని రాజకీయ జోక్యం చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ దేశ స్టార్ ఫార్వర్డ్ ఫ్లోరిన్ బలోగన్‌పై ఉన్న రెడ్ కార్డు సస్పెన్షన్‌ను ఫిఫా వాయిదా వేసింది. దీంతో బెల్జియంతో జరిగే కీలకమైన మ్యాచ్‌లో బలోగన్ ఆడేందుకు మార్గం సుగమమైంది. వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఆటగాడికి విధించిన రెడ్ కార్డు సస్పెన్షన్‌ను ఇలా రద్దు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారి.
బుధవారం బోస్నియా హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 2–0తో గెలిచింది. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి డిఫెండర్ తారిక్ ముహరేమోవిక్ చీలమండను బలోగన్ తొక్కడంతో బ్రెజిల్ అంపైర్ రాఫెల్ క్లాస్ బలోగన్‌కు రెడ్ కార్డు విధించాడు. ఒకసారి రెడ్ కార్డు వస్తే మ్యాచ్‌కు అటోమెటిక్‌గా సస్పెన్షన్‌ను విధిస్తారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ వెంటనే ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినోకు ఫోన్ చేశారు.
రెడ్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని. ఆ తర్వాత ఫిఫా క్రమశిక్షణా కమిటీ తన నిబంధనల్లోని ఆర్టికల్ 27ను ఉపయోగించి బలోగన్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది కాలంలో అతను మళ్లీ ఇలాంటి తప్పు చేయకపోతే సస్పెన్షన్ పూర్తిగా రద్దవుతుంది. ఫిఫా నిర్ణయంపై బెల్జియం ఫుట్‌బాల్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

