అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల తీర్పు: అది మామూలు దారుణం కాదు. మాటలకందని విషాదం. కనీ విని ఎరుగని రక్తపాతం. అయిన వాళ్ళని కోల్పోయింది.. ఆర్త నాదాలు పెడుతూ.. అహ్మదాబాద్ నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 56 మంది చనిపోయారు.. ఉగ్రవాదులు బాంబులు పేల్చివేసి అహ్మదాబాద్ నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దారుణం భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం లాగా.. నెత్తుటి జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఈ వ్యవహారం అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉగ్రవాద వ్యతిరేక బృందాలు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేశాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పట్టుకున్నారు. మొత్తం 49 మందిని దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనేక రకాలుగా దర్యాప్తు చేసింది. కీలక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత న్యాయస్థానాలలో ఆధారాలను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. అనేక దఫాలుగా విచారణ పూర్తయిన తర్వాత.. ఆ 49 మంది విషయంలో గుజరాత్ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సంచలన తీర్పును.
2008 జూలై 26న అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు వరుసగా బాంబు పేలుళ్లు జరిపారు. ఈ దారుణంలో 56 మంది చనిపోయారు. రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. 70 నిమిషాల వ్యవధిలో ఏకంగా 21 బాంబులను పేల్చేశారు. ఈ దారుణం మాపని అని హర్కత్ ఉల్ అల్ ఇస్లామి అనే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ దీనికి బాధ్యత వహిస్తున్నట్లు ఉంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా గుజరాత్ కోర్టు కీలకతీర్పును. 38 మందికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 11 మందికి జీవిత ఖైదు విధించింది.
ఆ 38 మంది దేశంలో దారుణానికి పాల్పడ్డారని.. అమాయకులను ప్రజలను చంపేశారని.. అటువంటి వ్యక్తులకు కనీసం బతికే హక్కు కూడా లేదని న్యాయస్థానం తన తీర్పులో ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇటువంటి వ్యక్తులు సమాజానికి బద్ధ శత్రువులు అని. ఈ తీర్పుతో నాడు అహ్మదాబాద్ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని.. వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. కోర్టు తీర్పు అనంతరం వారు సంతృప్తి వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్లను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

