మైత్రి రవి: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన వై.రవిశంకర్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం), బ్యాక్‌గ్రౌండ్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన ‘రాజా ది రాజా’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్ లేదా డైమండ్ స్పూన్‌తో పుట్టి రావచ్చు. కానీ, ఇక్కడ ఆ స్పూన్లు ఏమీ చేయలేవు. బ్యాక్‌గ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ ఇవ్వడానికే ఉపయోగపడుతుందని, ఆ తర్వాత ప్రేక్షకులు ఆదరించాలంటే టాలెంట్ ఒక్కటే శరణ్యమని ఆయన చెప్పారు.
కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటీనటులకు ఆయన ఒక పవర్ఫుల్ సందేశాన్ని ఇస్తూ.. “మన వెనుక ఎవరి అండ లేదు, మనల్ని నడిపించే గాడ్‌ఫాదర్ ఎవరూ లేరని భావించి క్షేత్రస్థాయి నుంచి కష్టపడితేనే పరిశ్రమలో నిజమైన విజయం దక్కుతుంది” అని కొత్త హీరో రిత్విక్‌కు దిశానిర్దేశం చేశారు. సినిమా పట్ల అంకితభావం, కష్టపడే తత్వమే కెరీర్‌ను నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రవిశంకర్ చేసిన ఈ కామెంట్స్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ కనిపించడం కష్టపడితేనే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే నిజాయితీ గల మాటలను మైత్రీ నిర్మాత ఓపెన్‌గా చెప్పడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

