హైదరాబాద్: మంచి గుర్తింపు ఉన్న సంస్థకు ధరణి పోర్టల్ అప్పగించారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైతు సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆస్తుల చిట్టాను ప్రైవేటు సంస్థ చేతిలో పెడతారా అని నాడు ఆరోపించారని, భూముల విషయంలో 22 వేల అక్రమాలు జరిగినట్లు ఓ పత్రికలో వచ్చిందని తెలియజేశారు. భూమి బదలాయింపు జరగాలంటే భూ యజమానికి నోటీసు, భూమి బదలాయింపునకు భూయజమాని, కొనుగోలుదారులకు సమాచారం అందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈ నిబంధనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు మంత్రి శాఖ ఉల్లంఘించిందని, ధరణి పేరును భూగా మార్చినట్లు ప్రభుత్వం చెప్పిందని, తమకనుసన్నల్లోనే భూ కుంభకోణం ఎక్కువగా ఉందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కామ్ జరిగింది, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్ధిపేటలో స్కామ్ ఉంది. జనగామ జిల్లాలో జనవరిలో కుంభకోణం బయటపడిందని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని 30 మంది మీ సేవ నిర్వాహకులు దోపిడీ, రైతుల నుంచి రూ.లక్ష తీసుకుని ప్రభుత్వానికి రూపాయి కట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.

