మా ఇంటి బంగారం 18 రోజుల కలెక్షన్ సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కమర్షియల్ గా ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాలకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. లాభాల రిటర్న్స్ విషయం లో అయితే ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఒకటి గా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 18 రోజులైంది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. దీనిని బట్టే చెప్పొచ్చు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిది. 18 వ రోజున కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 24 లక్షల రూపాయల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. గత వారం విడుదలైన కొత్త సినిమాలకు కూడా నిన్న ఈ రేంజ్ వసూళ్లు నమోదు కాలేదు. ఓవరాల్ గా 18 వ రోజున వరల్డ్ వైడ్ గా 32 లక్షల రూపాయల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి.
18 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రం వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ఒక్క నైజం ప్రాంతం నుండే ఈ చిత్రం 14 కోట్ల 72 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రావడం సాధారణమైన విషయం కాదు. ఇంకో రెండు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వస్తే , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేస్తుంది. కానీ అంత దూరం వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం 18 రోజులకు గానూ 11 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం రన్ తో ప్రస్తుత ఆంధ్రా రన్ బాగా తగ్గిందనే చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం 26 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు , 50 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి ఈ చిత్రం 1 కోటి 91 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల 27 లక్షలు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 43 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వసూళ్లు , 89 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఊపుని చూసి కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందేమో అని అనుకున్నారు , కానీ ఆ రేంజ్ వసూళ్లు కష్టమే అని.

