చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే చాలు అతని అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. ప్రేక్షకులు అతని సినిమాలను చూడడానికి వేయికన్నులతో ఎదురు చూస్తారు. ఇక అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆయననుంచి క్వాలిటీ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు మాత్రమే ఆయన పరిమితమైపోయాడు. నటన విషయంలో కూడా పెద్దగా వైవిధ్యాన్ని చూపించడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సత్తా చాటుకుంటూ డిఫరెంట్ యాక్టింగ్ ను ట్రై చేయడానికి ప్రయత్నించి ముందుకు సాగుతున్నాడు.
ఇక ఈ విషయంలో అతన్ని మెచ్చుకోవచ్చు కానీ తన ఏజ్ కి తగ్గ పాత్రలను చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి అంటే ఆయన ఒక శిఖరం లాంటివాడు. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి.
ఇప్పుడు ఆయన ఏ పాత్ర చేసినా కూడా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. అప్పట్లో చిరంజీవి కి పోటీ ఇచ్చే హీరోలు ఎంత మంది ఉన్నా కూడా తను మాత్రమే మెగాస్టార్ గా ఎలా మారారు అంటే ఆయన దానికోసం ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాడు. ఇక తను ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అవ్వకుండా ప్రతి సినిమా విషయంలో క్షుణ్ణంగా ముందుకు సాగాడు. తన ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు ఎనిమిది ఇండస్ట్రీ హిట్లను సాధించాడు. వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్స్ ను దక్కించుకున్న ఘనత కూడా తనకే దక్కింది. అందుకే చిరంజీవి మెగాస్టార్ గా మారాడు అనేది వాస్తవం…
తనను ఎంపిక చేసుకునే దర్శకులు కూడా అలాంటి వారే కావడం ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాడు. ఇక తన తరంలో ఉన్న హీరోల్లో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వాళ్ళు కూడా చిరంజీవికి పోటీని ఇచ్చినప్పటికి వాళ్లకి అందనంత ఎత్తులో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. అందుకే ఆయన ఈరోజుకి మెగాస్టార్ గానే వెలుగొందుతున్నాడు…

