- బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
- ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్
- ఆర్జేడీ నుంచి రేఖా గుప్తా పోటీ
బీహార్‌లోని బంకీపూర్‌లో జరుగుతున్న ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. రాజకీయ వ్యూహకర్త, జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠ. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే నితిన్ నబిన్.. రాజ్యసభకు వెళ్లడంతో బంకీపూర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. 30న బైపోల్ ఎన్నిక జరగనుంది.
ఇప్పటికే జన్ సూరాజ్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ కదనరంగంలోకి దిగారు. ఇప్పుడు బీజేపీ పోటీగా అభిషేక్ కుమార్‌ను రంగంలోకి దింపింది. ఇక ఆర్జేడీ నుంచి రేఖా గుప్తాను రంగంలోకి దింపారు. మొదట ప్రశాంత్ కిషోర్‌కు ఇండియా కూటమి మద్దతు ఇస్తుందని అంతా భావించారు గానీ.. చివరికి ఆర్జేడీ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో త్రిముఖ పోటీ.
బంకిపూర్ స్థానం నుంచే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నితిన్ నవీన్ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. నితిన్ నవీన్ 2010 నుంచి బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సుమారు 52,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మార్చిలో ఆయన బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బంకిపూర్ స్థానానికి జూలై 30న పోలింగ్ జరగనుండగా… ఆగస్టు 3న ఫలితాలు వెల్లడిస్తారు. ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగడంతో పోటీ చాలా ఆసక్తికరంగా మారింది.

