జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ వారి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు మంగళవారం 1,22,440 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది.
మహదేవపూర్, జూలై 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు మంగళవారం 1,22,440 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బరాజ్ గరిష్ఠ ప్రవాహం ఎత్తు రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90.80 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

