బీజింగ్ : చైనాలో అవినీతి తిమింగళానికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. షీజాంగ్(టిబెట్) స్వయం పాలిత ప్రాంత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మాజీ అధికారి అనేక ఏళ్లుగా లంచాల రూపంలో వేలాది కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.దీంతో న్యాయస్థానం దోషిగా అతడిని తేల్చి మరణశిక్ష విధించింది. నాంజింగ్లో చేసిన వాంగ్ యూలిన్ భారీ స్థాయిలో లంచాలు తీసుకున్న కంపెనీలు, వ్యక్తులకు ఇంజినీరింగ్ కాంట్రాక్టులను అప్పగించేవాడని కోర్టు. ఈ విధంగా 19932023మధ్యకాలంలో మొత్తం 325 మిలియన్ డాలర్ల’ (రూ. 3100 కోట్లు ) విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు దర్యాప్తులో తేలింది.

