ఆంధ్రప్రదేశ్:విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో అర్ధరాత్రి వేళ ఓ దారుణ ఘటన వెలుగుచూసింది.ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కర్రీ పైడమ్మ(కర్రి పైడమ్మ) (72) అనే వృద్ధు రాలిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు.
అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు.ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పెందు సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్లూస్ టీం రంగంలోకి దిగి అక్కడ లభించిన ఆధారాలను సేకరించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.ఈ ఘోర కలకలం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది.

