శృతి హాసన్: కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు , అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది శృతి హాసన్. తండ్రి లాగానే ఈమె కూడా గొప్ప టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. అద్భుతంగా నటించలేదు , పాటలు పాడగలదు , డ్యాన్స్ వేయగలదు , ఇలా ఒక్కటి కాదు రెండు కాదు , ఈమెలో ఎన్నో కళలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈమె ‘వారణాసి’ చిత్రంలో ‘సంచారి’ అనే పాటని ఎంత అద్భుతంగా పాడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలో ఈమె చేసిన స్పెషల్ ఐటెం సాంగ్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మరోపక్క హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది శృతి హాసన్.
ఇకపోతే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన తండ్రి కమల్ హాసన్ తో ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న నాతో ఒక స్నేహితుడిగా , చాలా సరదాగా ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ ని నాన్న బాగా అనుసరించారు. నాకు కూడా కొన్ని ఫన్నీ వీడియోలు పంపుతూ ఉంటారు. కొన్ని వీడియోస్ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. అప్పుడు నేను ఆయనతో ‘ఈ ఆంటీ చేసేవి పెద్దగా నవ్వు రప్పించడం లేదు , ఈమెవి పంపకండి నాన్న’ అని చెప్పేదాన్ని. అంతే కాకుండా కొన్ని కళాత్మకమైన వీడియోలు కూడా పంపుతుంటారు. ఎవరైనా చిన్న పాప అద్భుతంగా పాడితే వాటిని నాకు షేర్ చేసినప్పుడు నాకు కలిగే ఫీలింగ్ , ఆ పాపని ఆయన చూసినప్పుడు నేను గుర్తు వచ్చి ఉంటానని అనిపిస్తుంది. అలాంటివి చూసేందుకు చాలా ముచ్చటగా అనిపిస్తుంటాయి. పల్లెటూర్లలో వంటచేసేవారి వీడియోస్ , సంగీతకారులు అంటే నాన్నకి చాలా ఇష్టం , వాళ్ళ వీడియోస్ ని కూడా షేర్ చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు శృతి హాసన్.
ఆమె చెప్పిన మాటలను బట్టీ చూస్తుంటే , కమల్ హాసన్ ఖాళీ సమయం లో ఇన్ స్టాగ్రామ్ తో కాలక్షేపం చేస్తారని అర్థం అవుతోంది. ఇకపోతే శృతి హాసన్ ప్రస్తుతం ఎంతటి పీక్ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ముట్టుకుంటే బంగారం అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ గా పిలిపించుకున్న శృతి హాసన్ , ఇప్పుడు నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా తయారైంది. ప్రస్తుతం ఈమె ట్రైన్ అనే తమిళ చిత్రం , అదే విధంగా ‘ఆకాశం లో ఒక తార’ అనే తెలుగు చిత్రం లో నటిస్తోంది.

