– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ కేసులో నిందితులకు కస్టడీ పొడిగించారు.ఈ మేరకు ఢిల్లీ రౌజ్ అవిన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం కేసు వాదనలు విన్న కోర్టు ఈ నెల 11 వరకు కస్టడీ పొడిగించింది. ఈ కేసులో మంగీ లాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్, యశ్ యాదవ్, శుభమ్ ఖైర్నార్, మనీషా వాగ్మారే, ప్రహ్లాద్ కులకర్ణి, ధనంజయ్ లోఖండే, మనీషా మంధరే, శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్, మనీషా సంజయ్ హవాల్దార్, డాక్టర్ మనోజ్ షిరూరేలను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ విచారణ అనంతరం అందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనితో పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థుల ఆందోళన జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ జరిగింది.
– ప్రకటన –

