రాత్రిసమయాల్లో ఉలిక్కిపడి లేస్తున్నారా.. భయపడి నిద్ర పట్టడం లేదా.. చిన్న అలికిడి అయితే బెంబేలెత్తుతున్నారా..!దిష్టి తగిలింమోనని భయపడుతున్నారా. ఇలాంటి బాధలను కిచెన్లో ఉండే వెల్లుల్లితో పరిష్కరిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వెల్లుల్లితో దిష్టి నివారణ చర్యల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
చాలామంది రాత్రి పూట ఉన్నట్టుండి భయపడి లేస్తారు. ఇక వారికి నిద్రపట్టదు. భయం భయంగా గడుపుతుంటారు. ఇక వారికి నిద్ర పట్టరు. చిన్న అలికిడి అయితే బెంబేలెత్తుతారు. ఇంట్లో పెద్దలు ఉంటే దిష్టి తగిలిందేమో.. దిష్టి తీయండంటూ ..ఇరుగుదిష్టి.. పొరుగుదిష్టి.. నీ దిష్టి.. నా దిష్టి.. ఊళ్ళో వాళ్లందరి దిష్టి పోవాలి.. తు తు!! అంటూ దిష్టి తీస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తి తాండవిస్తుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. వెల్లుల్లితో ప్రతికూల శక్తిని తొలగించడానికి పండితులు చెబుతున్నారు.
మనం దిష్టిలో ఉన్నప్పుడు లేదా దేనికైనా భయపడినప్పుడు, తరచుగా రాత్రిపూట హఠాత్తుగా మేల్కొంటాము. ఆ తర్వాత, తిరిగి నిద్రపోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికి కారణం పీడకలలు కావచ్చు, అవి మనల్ని ఎంతగానో కలవరపెడతాయి, దానివల్ల మనం సరిగ్గా నిద్రపోలేక, నిరంతరం ఏదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము.
సాధరణంగా వెల్లుల్లిని రెసిపీల్లో కమ్మని వాసన… రుచికి వాడతారు. ఆయుర్వేదంలో కొన్ని మందుల తయారీలో కూడా వాడుతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కొన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తామని పండితులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో భయపడుతూ.. నిద్ర లేచి .. ఇక నిద్రపట్టకపోతే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని పెద్దలు చెబుతారు. అలాంటి వాటిని వెలల్లితో తొలగిస్తారు.
వెల్లుల్లితో భయం తొలగించే విధానం
రెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయాలి. వాటిని వాసన చూస్తూ దిండు కింద పెట్టి పడుకోవాలి. వెల్లుల్లికి ఉంటే ఘాటైన వాసన వలన ప్రతికూల శక్తి ఆ ప్రాంతానికి రాదు.. అప్పటికే అక్కడ నుంచి వెళుతుంది. అలా దిండుకింద ఉంచిన వెల్లుల్లి రెబ్బలను రాత్రంతా దిండుకింద అలానే ఉంచాలి.
పొద్దున్నే తెల్లవారిన తరువాత.. దంతాలను శుద్ది చేసుకున్న తరువాత ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఈ రెండు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. స్నానం చేసిన తరువాత ఆ నీటిలో చిటికెడు పసుపు కలిపి వేపచెట్టు కానీ.. రావి చెట్టు కానీ.. లేదా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే రాత్రి పూట నిద్రలో వచ్చే చెడు ..భయంకర కలలు రావని చెబుతున్నారు. దిష్టి వలన భయము తొలగి.. నిద్రలో ఉలిక్కిపడి లేవకుండా ఎంతో చక్కగా నిద్రపోయేందుకు అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
నిరాకరణ: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించి రూపొందించబడింది. ఈ జాబితా V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించారు. మీకున్న జ్యోతిష్య సమస్యల నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

